అభిమానులను ఫిదా చేస్తోన్న అదా | Adha Its My Feeling Dance Video Viral | Sakshi
Sakshi News home page

అభిమానులను ఫిదా చేస్తోన్న అదా

Published Sat, Jul 28 2018 8:44 PM | Last Updated on Tue, Jul 31 2018 11:28 AM

Adha Its My Feeling Dance Video Viral - Sakshi

ముంబై పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ‘కికి చాలెంజ్‌’ తీసుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా వీరి కోవలోకి ‘క్షణం’ హీరోయిన్‌ చేరారు. అదా శర్మ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్‌ ఎక్కువగా జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోలను, డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.

తాజాగా అదా ‘కికి చాలెంజ్‌’లో భాగంగా చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్‌మీడియాలో పోస్టు చేసిన ఒక్క రోజులోనే ఏడు లక్షల వ్యూస్‌ సంపాదించింది. ‘కికి చాలెంజ్‌’లో భాగంగా అదా ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’కు తన స్టైల్‌లో డ్యాన్స్‌ చేసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ హాలీవుడ్‌ సాంగ్‌కు అదా దేవకన్యలా ముస్తాబై, కథక్‌, భరత నాట్యం, వెస్ట్రన్‌ రీతులు కలిపి చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

ఈ వీడియోను అదా తన ట్విటర్‌లో పోస్టు చేసిన 24 గంటల్లోనే 7 లక్షల మందికిపైగా వీక్షించారు. దాదాపు 3 వేల మంది కామెంట్లు చేశారు. ‘అద్భుతంగా చేశావ్‌, క్యూట్‌’, ‘నీ హావభావాలు అద్భుతంగా ఉన్నాయి’, ‘ఈ పాటకు నువ్వు ఇలాంటి దుస్తుల్లో డ్యాన్స్‌ చేయడం గొప్ప విషయం, అత్యుత్తమమైన డ్యాన్స్‌..’ అంటూ కామెంట్‌ చేశారు.

హలీవుడ్‌ సింగర్‌ డ్రేక్‌ తన కొత్త పాట ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్‌’ను కూడా జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్‌ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి లేదా వాహనంలోనే ఉండి ‘ఇన్‌ మై లైఫ్‌’ పాటకు అనుగుణంగా.. కదులుతున్న వాహహంతోపాటే డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అయితే కింద పడకూడదు, మధ్యలో ఆగకూడదు. అలా చేస్తేనే చాలెంజ్‌ నెగ్గినట్లు. కానీ అదా శర్మ మాత్రం తన ‘కికి చాలెంజ్‌’ను కదులుతున్న వాహనంలో కాక, కారును ఆపి పక్కన డ్యాన్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement