The Kerala Story Second Day Collections - Sakshi
Sakshi News home page

The Kerala Story: ది కేరళ స్టోరీ రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Published Sun, May 7 2023 4:10 PM | Last Updated on Sun, May 7 2023 4:52 PM

The Kerala Story Second Day Collections - Sakshi

ది కేరళ స్టోరీ.. ట్రైలర్‌ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం చెలరేగింది. బలవంత మతమార్పిడికి గురై ఐసిస్‌లో చేరిన మహిళల కథే కేరళ స్టోరీ. సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్‌ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోకి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సైతం జరిగాయి.

ఈ వివాదాల మధ్య కేరళ స్టోరీ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.8.03 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు అంతకుమించిన వసూళ్లు రాబట్టింది. శనివారం ఒక్కరోజే రూ.11.22 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 39.73% వృద్ధి కనబర్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది.

ఆదివారం కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బల్రానీ ముఖ్య పాత్రలు పోషించారు. చాలామంది ఈ సినిమాను వ్యతిరేకిస్తుంటే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్‌ రద్దు చేయడం విశేషం.

చదవండి: బలవంతంగా బంధాల్లో ఉండేకంటే ఒంటరిగా ఉండటమే బెటర్‌: సదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement