I'm Fine Guys; The Kerala Story Actress Adah Sharma Reacts On Road Accident - Sakshi
Sakshi News home page

Adah Sharma: ది కేరళ స్టోరీ టీమ్‌కు యాక్సిడెంట్‌.. స్పందించిన హీరోయిన్‌

Published Sun, May 14 2023 9:44 PM | Last Updated on Mon, May 15 2023 11:15 AM

The Kerala Story Actress Adah Sharma Reacts on Road Accident - Sakshi

మొన్నటి వరకు హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న అదా శర్మ ఇప్పుడు ది కేరళ స్టోరీతో జాతీయ స్థాయిలో సెన్సేషన్‌ అవుతోంది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే వంద కోట్లు రాబట్టంది. సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో ది కేరళ స్టోరీ డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌, హీరోయిన్‌ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వెళ్తున్న దారిలో ఈ ప్రమాదం జరగడంతో గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్‌పై అదాశర్మ స్పందించింది. 'యాక్సిడెంట్‌ అయిందని తెలియడంతో చాలామంది నా యోగక్షేమాలను ఆరా తీస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కేరళ స్టోరీ సినిమా టీమ్‌ అంతా బాగానే ఉన్నాం. పెద్ద ప్రమాదమేమీ కాదు, కంగారుపడాల్సిన పని లేదు' అని ట్వీట్‌ చేసింది. ఈ ప్రమాదం వల్ల కరీంగనర్‌లో హిందూ ఏక్తాయాత్రకే కేరళ స్టోరీ టీమ్‌ హాజరు కాలేకపోయింది. ఈ సినిమా విషయానికి వస్తే కేరళలో తప్పిపోయిన నలుగురమ్మాయిలు తప్పని పరిస్థితుల్లో ఐసిస్‌లో చేరడం, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టం, అందుకు దారి తీసిన పరిస్థితులను చూపించారు. విపుల్‌ షా నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది

చదవండి: యాక్సిడెంట్‌కు గురైన ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్‌, హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement