ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే దాదాపుగా రూ.136 కోట్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్‌లో ఆదా శర్మ టాప్ ప్లేస్ దక్కించుకుంది.
(ఇది చదవండి: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం)
అంతకుముందు అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగుభాయి కతియావాడి పది రోజుల్లో రూ.129.1 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా ది కేరళ స్టోరీ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో బాలీవుడ్ హీరోయిన్లలో ఆదా శర్మ టాప్‌లో నిలిచింది. తాజాగా ఈ చిత్ర విజయంపై నటి ఆదా శర్మ స్పందించింది. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని చెప్పుకొచ్చింది.
ఆదా శర్మ మాట్లాడుతూ.. 'నేను ఇంత ఘనవిజయం సాధిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది నా చేతిలో ఉందో లేదో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నేను చేస్తున్న పనిని కొనసాగిస్తాను. ఇలాంటి సినిమా తీస్తానని నేనెప్పుడూ ప్లానింగ్ చేయలేదు. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని ఎవరైనా గట్టిగా నమ్మితేనే ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది.' అని అన్నారు.
ది కేరళ స్టోరీ ఆదివారం ఒక్కరోజే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.81.14 కోట్లు రాగా.. రెండో వారాంతంలో రూ.55.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొంతమంది మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో రిక్రూట్ చేయబడ్డారన్న కథాంశంగా తెరకెక్కించారు.
(ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్)
ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి.
Woahhh !! Audience 🙏❤️ thank u ! This is just ....... *no words' 👀😱❤️ https://t.co/6kV2j07Aq7
— Adah Sharma (@adah_sharma) May 15, 2023
Comments
Please login to add a commentAdd a comment