ది కేరళ స్టోరి చిత్రంపై ఇప్పటికే పలు రకాల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతుల మతం మార్చి ఆ తరువాత ఉగ్రవాదులుగా తయారు చేసే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇది. ఇది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని యూనిట్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇదే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం.
దీంతో కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. తమిళనాడు థియేటర్ల యాజమాన్యం కూడా ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన రద్దు చేశాయి. అయితే బీజేపీ అధికార ప్రభుత్వాలు మాత్రం ఈ చిత్రానికి వినోదపు పన్నును రద్దు చేశాయి. ఇక సుప్రీంకోర్టు కూడా ది కేరళ స్టోరీ చిత్రంపై నిషేధాన్ని కొట్టివేసింది. ఇలాంటి రగడ మధ్య ఈ చిత్రం సుమారు రూ.200 కోట్లు వసూలు చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా ది కేరళ స్టోరీ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక భేటీలో తాను పబ్లిసిటీ చిత్రాలకు వ్యతిరేకినని అన్నారు. యధార్థ కథ అంటూ ఏదో ఒక అంశాన్ని చెబితే అది నిజం అవదన్నారు. వాస్తవంగా అది యదార్థ కథ అయి ఉండాలన్నారు. అయితే ది కేరళ స్టోరీ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజం కాదని కమల్ హాసన్ పేర్కొన్నారు.
Woww 4th weekend and so many of you in theatres for #TheKeralaStory !! So so grateful 👻👻👻🦍🦍♥️♥️
— Adah Sharma (@adah_sharma) May 28, 2023
Grateful to everyone in the industry who gave me every role in every movie, ad , music video sab kuch to get to be in theatres now with this one ❤️ . Thank uuuuuuuu !! pic.twitter.com/mXSYtXDt80
Comments
Please login to add a commentAdd a comment