బహుభాషా చిత్రం 'ది కేరళ స్టోరీ' సినిమా రిలీజ్ కష్టాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదాల్లో కూరుకుపోయింది. ఆఖరికి ఎన్నోప్రయాసలు పడి ఎట్టకేలకు ప్రేక్షకులు మందుకు వచ్చిందనే లోపలే షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఈ సినిమాకి రాజకీయ వివాదం బంకుమన్నులా అతుక్కుపోయింది. ఏదోలా విడుదలైందని ఊపిరి పీల్చుకునేలోపే థియోటర్‌లో ప్రదర్శించనీయకుండా బ్యాన్ చేస్తున్నారు.
ఓ పక్క తమిళనాడులో విడుదలైన రెండో రోజే థియటర్ యజామాన్యం బ్యాన్ చేసి షాక్ ఇచ్చింది. ఇది మరవుక మునుపే ఇప్పుడూ తాజగా పశ్చిమ బెంగాల్ కూడా ఈ సినిమాపై నిషేధం విధించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'ది కేరళ స్టోరీపై' నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె కూడా ఈ సినిమాని వక్రీకరించిన కథేనని అన్నారు. ఇది ద్వేషం, హింసాత్మక సంఘటనలను రేకెత్తించేలా ఉందని, దాన్ని నియంత్రించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మమతా.
ఐతే మమత నిర్ణయంపై స్పందించిన నిర్మాత విపుల్ షా.. ఆమె కూడా అలానే చేస్తే తాము కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండిపడ్డారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సాధ్యమైనంత మేర పోరాడతామని తెగేసి చెప్పారు. కాగా, ఈ సినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు?, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు.
దీంతో ఒక్కసారిగా ఇది పెను రాజకీయ వివాదానికి దారితీసింది. కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ తోసహా, పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విడుదల చేయకుండా అడ్డుకునేందుకు కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. అయితే కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు దీన్ని విడుదల చేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం. దీని వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఉన్నాయంటూ విపక్షాలు గట్టిగా మండిపడుతున్నాయి.
(చదవండి: త్వరలో స్టాలిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! ఆ మంత్రి ఔట్)
Comments
Please login to add a commentAdd a comment