సాక్షి, హైదరాబాద్: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు 45 నిమిషాలు తమ మాట, పాట వినిపించానని ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు. రాహుల్‌కు ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్– సేవ్ డెమోక్రసీ’ పుస్తకాన్ని అం దించానని చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ నెల 15 నుంచి పల్లెపల్లెకూ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను గురువారం సచివాలయంలో కలిసి తనకు భద్రత కల్పించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలిసారి ఓటు హక్కు లభించిందని, ఎవరికి ఓటు వేయాలన్నది సమస్యగా మారింద న్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment