కంటెంట్ బాగుంటే ప్రచారాలు, ఆర్భాటాలు ఏవీ అవసరం లేదు. మౌత్ టాక్‌తోనే హిట్ సాధించేస్తాయి. అలా విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా థియేటర్లలో విడుదల చేశారు. ఆశ్చర్యంగా పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ కలెక్షన్స్ ఎక్కువయ్యాయి. అలా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
ఓటీటీలో..
నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 14న తెలుగులో విడుదలైంది. ఇందులో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం (జూలై) 12 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని ఓటీటీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!
కథేంటంటే?
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఓ రోజు యాక్సిడెంట్‌లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్త డబ్బా వల్ల కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటాడు. ఓ రోజు లక్ష్మి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత ఏమైంది? లక్ష్మి దొరికిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!
చదవండి: రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం
Comments
Please login to add a commentAdd a comment