
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా సర్ధార్, శశికుమార్ హీరోగా కారి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేతలు ఏ.లక్ష్మణన్, వెంకట్ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రన్ బేబీ రన్. నటుడు దర్శకుడు ఆర్జే బాలాజి కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేష్ కథానాయకిగా నటించారు. నటి రితిక, వివేక్ ప్రసన్న, విశ్వ, రాజా అయ్యప్ప ప్రధాని పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ చాయాగ్రహణం, శ్యాంసిఎస్ సంగీతాన్ని అందించారు.
చదవండి: నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు: రకుల్
మలయాళ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక టీనగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు జయన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తాను మలయాళంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో చిత్రం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ కథను లక్ష్మణన్‌కు చెప్పగా ఆయనే నటుడు ఆర్జే బాలాజీని హీరోగా సూచించారన్నారు.
చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం
కథ వినగానే బాగా నచ్చిందని అంతగా దర్శకుడు కథను పకడ్బందీగా తయారు చేశారని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. నటుడు ఆర్జే బాలాజి మాట్లాడుతూ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ తనను కలిసి చిరునవ్వుతోనే కథలు చెప్పారన్నారు. అంద 7 నాట్కళ్ చిత్రం కె..భాగ్యరాజ్‌కు మరుజన్మే ఆయన పేర్కొన్నారు. ఈయన ప్రతిభావంతులైన టీమ్‌ను నియమించుకున్నారన్నారు. నిర్మాత లక్ష్మణన్ ఖర్చుకు వెనకాడకుండా ప్రముఖ సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని భారీగా నిర్మించారన్నారని తెలిపారు. తన పారితోషికం గురించి అడుగుతున్నారని, అది నిర్మాతల లాభాలను బట్టి ఉంటుందని ఆర్జే బాలాజి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment