ritika
-
National Daughter’s Day 2024: వందే భారత్‌ను పరుగులు పెట్టిస్తున్న రితికా టిర్కీ
జంషెడ్పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్‌ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.జంషెడ్‌పూర్‌లోని జుగ్సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపి వందేభారత్‌ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్‌గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యారు. రితికా భర్త బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్‌గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్‌గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు. ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! -
Paris olympics: ముగిసిన భారత ప్రస్థానం.. ఆరుతో సరి
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్’లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. శనివారం రెజ్లింగ్ ఈవెంట్‌తో భారత పోరాటం ముగిసింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 76 కేజీల విభాగంలో రీతిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ఆమెను ఓడించిన కిర్గిస్తాన్ రెజ్లర్ ఫైనల్ చేరకుండా సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఫలితంగా రీతికకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కనీసం కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లేకుండా పోయింది. ‘పారిస్’లో భారత్‌కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 70వ స్థానంలో ఉంది. ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఫలితంగా చివరిరోజు పతకాల పట్టికలో భారత్ స్థానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలిచి 48వ స్థానంలో నిలిచింది. పారిస్: విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. శనివారంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 76 కేజీల విభాగంలో రీతిక కాంస్య పతక పోరుకు అర్హత సాధించి ఉంటే ఆదివారం కూడా భారత్ పతకం రేసులో నిలిచేది. కానీ రీతిక పతకం రేసులో స్థానం సంపాదించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ రీతిక క్వార్టర్ ఫైనల్లో కిర్గిస్తాన్ రెజ్లర్ ఐపెరి మెదెత్ కిజీ చేతిలో ఓడిపోయింది. మూడు నిమిషాల నిడివి గల రెండు భాగాలు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. స్కోరు సమమైతే నిబంధనల ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ బౌట్లో ముందుగా రీతిక ఒక పాయింట్ సాధించింది. రెండో భాగంలో కిర్గిస్తాన్ రెజ్లర్ పాయింట్ స్కోరు చేసి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ పాయింట్ లభించలేదు. దాంతో చివరి పాయింట్ స్కోరు చేసిన కిర్గిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. అనంతరం కిర్గిస్తాన్ రెజ్లర్ సెమీఫైనల్లో 6–8 పాయింట్ల తేడాతో కెన్నీడీ అలెక్సిస్ బ్లేడ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. దాంతో ‘రెపిచాజ్’ రూపంలో రీతికకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం చేజారింది. అంతకుముందు తొలి రౌండ్లో రీతిక కేవలం 29 సెకన్లలో హంగేరి రెజ్లర్ బెర్నాడెట్ నగీపై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో గెలిచింది. ఇద్దరు రెజ్లర్ల మధ్య పాయింట్ల తేడా 10 పాయింట్లకు చేరుకున్న వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేస్తారు. బెర్నాడెట్‌తో జరిగిన బౌట్లో 29 సెకన్ల సమయానికి రీతిక 12–2తో 10 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి రీతికను విజేతగా ప్రకటించారు. -
Olympics: స్కోర్లు సమం.. అయినా భారత రెజ్లర్ ఓటమి! కారణం?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ రితికా హుడాకు చేదు అనుభవం ఎదురైంది. అద్భుత ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, కాంస్య పతక రేసు ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.కాగా హర్యానాకు చెందిన రితికా హుడా.. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ తరఫున ప్యారిస్ బరిలో దిగింది. హంగేరీ రెజ్లర్ బెర్నాడెట్ న్యాగీతో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 12-2తో రితికా పైచేయి సాధించింది. తద్వారా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడా విజేతగా నిలిచింది. ఫలితంగా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే, అక్కడ మాత్రం రితికకు కఠినసవాలు ఎదురైంది.కిర్గిస్తాన్‌కు చెందిన టాప్ సీడ్ ఐపెరి మెడిట్ కిజీతో రితికా క్వార్టర్స్‌లో తలపడింది. అయినప్పటికీ తన శక్తినంతటినీ ధారపోసి.. కిజీని నిలువరించేందుకు రితికా ప్రయత్నించింది. ఆఖరి వరకు పట్టుదలగా పోరాడి 1-1తో స్కోరు సమం చేసింది. అయితే, కౌంట్‌బ్యాక్ రూల్ ప్రకారం.. కిజీ చివరి పాయింట్ గెలిచింది.దీంతో ఐపెరి మెడిట్ కిజీని రిఫరీ విజేతగా ప్రకటించారు. అయితే, కిజీ గనుక ఫైనల్ చేరితే రితికాకు రెపిచెజ్లో పోటీపడే అవకాశం ఉంటుంది. ఇందులో గెలిస్తే రితికాకు కాంస్యమైనా ఖాయమవుతుంది.కౌంట్‌బ్యాక్ రూల్ అంటే ఏమిటి?యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) నిబంధనల ప్రకారం.. బౌట్ ముగిసేసరికి ఇద్దరు రెజ్లర్లు సమానంగా పాయింట్లు సాధిస్తే.. ‘టై’ బ్రేక్ చేయడానికి కౌంట్‌బ్యాక్ రూల్‌ను వాడతారు. ఈ క్రమంలో తమకు ఇచ్చిన మూడు అవకాశాల్లో ఎవరైతే.. ప్రత్యర్థిని ఎక్కువ సేపు హోల్డ్ చేసి.. తక్కువ తప్పులు చేస్తారో.. అదే విధంగా చివరగా ఎవరు టెక్నికల్ పాయింట్ సాధిస్తారో వారినే విజేతగా ప్రకటిస్తారు.రితికా- కిజీ మ్యాచ్‌లో.. కిజీ తప్పు కారణంగా రితికకు తొలి పాయింట్ వచ్చింది. అయితే, తర్వాతి బౌట్లో కిజీ పాయింట్ స్కోరు చేసి పైచేయి సాధించింది. ఫలితంగా రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు. -
అప్పుడేమో పద్ధతి.. ఇప్పుడు హాట్నెస్.. రితిక గ్లామర్ డోస్ (ఫొటోలు)
-
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
బ్లాక్ డ్రెస్‌లో రితికా నాయక్ నయగారాలు (ఫొటోలు)
-
Duet Movie: ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
లవ్ డ్యూయెట్
ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటించనున్న సినిమాకు ‘డ్యూయెట్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన మిథున్ వరదరాజ కృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్టూడియో గ్రీన్ పతాకంపై కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం గురువారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఆనంద్ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ, మాధవి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ ఇచ్చారు. తొలి సీన్‌కి దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఈ చిత్ర సహ–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ స్క్రిప్ట్‌ను దర్శకుడు మిథున్‌కు అందజేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘డ్యూయెట్’ నాకు స్పెషల్ ఫిల్మ్. మిథున్ మంచి కథ రాశాడు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ’’ అన్నారు మిథున్. ‘‘ఈ కథ విన్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. జీవీ ప్రకాశ్‌కుమార్ ఆల్రెడీ రెండు పాటలు ఇచ్చేశారు. వారం రోజుల్లో తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు. ఈ వేడుకకు హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. -
నేను స్టూడెంట్ సార్ అనేవాణ్ణి
‘‘నేను ప్రతిరోజూ విద్యార్థిలానే భావిస్తాను. ‘నేను స్టూడెంట్ సర్’ టైటిల్ విన్నప్పుడు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు ‘నేను స్టూడెంట్ సార్’ అనేవాణ్ని’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. బెల్లంకొండ గణేశ్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస..’ అనే పాటని విశ్వక్ సేన్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’ టీజర్ బాగుంది. సినిమా మంచి హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఫోన్ కొనడానికి కష్టపడే సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ ‘24/7 ఒకటే ధ్యాస..’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. ‘‘మా సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాఖీ ఉప్పలపాటి. ‘‘హీరో క్యారెక్టర్ ఏంటో ఈ పాట ద్వారా చెప్పాం’’ అన్నారు సతీష్ వర్మ. కథారచయిత కృష్ణ చైతన్య, పాటల రచయిత హర్ష, హీరోయిన్లు అవంతిక, రితిక మాట్లాడారు. -
నిర్మాతల లాభాలపైనే నా పారితోషికం: నటుడు బాలాజి
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా సర్ధార్, శశికుమార్ హీరోగా కారి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేతలు ఏ.లక్ష్మణన్, వెంకట్ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రన్ బేబీ రన్. నటుడు దర్శకుడు ఆర్జే బాలాజి కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేష్ కథానాయకిగా నటించారు. నటి రితిక, వివేక్ ప్రసన్న, విశ్వ, రాజా అయ్యప్ప ప్రధాని పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ చాయాగ్రహణం, శ్యాంసిఎస్ సంగీతాన్ని అందించారు. చదవండి: నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్ మలయాళ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక టీనగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు జయన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తాను మలయాళంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో చిత్రం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ కథను లక్ష్మణన్‌కు చెప్పగా ఆయనే నటుడు ఆర్జే బాలాజీని హీరోగా సూచించారన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కథ వినగానే బాగా నచ్చిందని అంతగా దర్శకుడు కథను పకడ్బందీగా తయారు చేశారని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. నటుడు ఆర్జే బాలాజి మాట్లాడుతూ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ తనను కలిసి చిరునవ్వుతోనే కథలు చెప్పారన్నారు. అంద 7 నాట్కళ్ చిత్రం కె..భాగ్యరాజ్‌కు మరుజన్మే ఆయన పేర్కొన్నారు. ఈయన ప్రతిభావంతులైన టీమ్‌ను నియమించుకున్నారన్నారు. నిర్మాత లక్ష్మణన్ ఖర్చుకు వెనకాడకుండా ప్రముఖ సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని భారీగా నిర్మించారన్నారని తెలిపారు. తన పారితోషికం గురించి అడుగుతున్నారని, అది నిర్మాతల లాభాలను బట్టి ఉంటుందని ఆర్జే బాలాజి పేర్కొన్నారు. -
జూనియర్ రేస్లర్ రితికా ఫోగట్ ఆత్మహత్య
-
రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా?
నిద్రలో కంటున్న చిరునవ్వుల కల ఆఖరి నిముషంలో చెదిరిపోయినట్లే, వాస్తవం లో నెరవేర్చుకోవాలన్న కల చివరి ఒక్క పాయింట్‌తోనో, ఒక్క మార్కుతోనో ఛిద్రమైపోతుంది. పోయింది పాయింటే తప్ప, తగ్గింది మార్కే తప్ప జీవితం కాదు. అంత ఆలోచించే శక్తి లేకపోయింది రితికా ఫొగట్‌కు! ఈ లోకాన్నే విడిచిపోయింది. ఎంత వయసని! పదిహేడేళ్ల అమ్మాయి రితిక. రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారిణి. ఆటలో ఫైనల్స్ వరకు వచ్చింది. ఒక్క పాయిట్‌తో ‘గెలుపు’ను మిస్ అయింది. ఎంత వ్యథ చెందిందో. గెలవలేకపోవడాన్ని తట్టుకోలేకపోయింది. ప్రాణాలు తీసుకుంది. నిజంగా తనే ప్రాణాలు తీసుకుందా? గెలిచి తీరాలన్న పంతం ఒత్తిడిగా మారి ప్రాణం తీసిందా? ఓడి, ఇంటికి వచ్చాకనైనా ఆమె లోలోపలి ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? బాధను పంచుకోలేకపోయారా? ఏమైనా.. ఇది విషాదం. చుట్టూ ఇంతమంది ఉండి ఒక్కరైనా రితిక మూడ్స్‌ని పసిగట్టి, ఆమెను కాపాడలేకపోవడం! ఆమె పెద్దమ్మ కూతుళ్లు గీతా ఫొగట్, బబితా ఫొగట్ ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్లూ రెజ్లర్లే! వాళ్లూ కెరీర్ ఆరంభంలో ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నవాళ్లే. తన ఆవేదనను ఒక్కమాటగానైనా అక్కలలో ఒక్కరికైనా చెప్పలేకపోయిందా రితిక!! ఎవరికి ముఖం చాటేయడానికి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది! రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మార్చి 14న జరిగిన రెజ్లింగ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో విజయం రితక చేజారింది. మార్చి 17న ఆమె తన జీవితాన్ని చేజార్చుకుంది. భరత్పూర్ నుంచి తిరిగొచ్చాక జైపూర్ దగ్గరి స్వగ్రామంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె చనిపోయిన తేదీపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోవడానికి కారణం మాత్రం ఏకాభిప్రాయానికి యోగ్యమైదే. ఓటమి నుంచి తిరిగొచ్చాక ఆమెనెవరూ అంటిపెట్టుకుని లేరు! ఒక మాటైతే అని ఉంటారు.. ‘నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అని. ‘టేక్ ఇట్ ఈజీ రితికా’ అని కూడా అని ఉండొచ్చు. కానీ ఆమె గుండె లోతుల్లో ఏం ఉందో ఎవరు ఊహించగలరు? ఊహించాలి. ఆటలో ఓడిన వారిని, మాట పడొచ్చిన వారిని ఒంటరిగా వదలకూడదు. నీడలా వెన్నంటి ఉండాలి. సున్నితమైన మనసు గలవారినే కాదు.. గట్టిగా ఉండేవాళ్లను కూడా దగ్గరగా గమనిస్తుండాలి. ఓటమి ఎంత గట్టివాళ్లనైనా క్రుంగదీస్తుంది. వారిలో కుంగుబాటు కనిపిస్తే నిఘా ఉంచాలి. చెట్టుకు కంచెలా వారి ప్రాణానికి ‘గమనింపు’ను కావలిగా పెట్టాలి. ‘రెస్ట్ ఇన్ పీస్ చోటీ బెహన్ రితికా’ అని వేల పోస్ట్‌లు వస్తున్నాయి. రితిక ఆ ఆరుగురు ‘పొఘట్ సిస్టర్స్’కి మాత్రమే చెల్లి కాదు అన్నట్లుగా నెట్ నిండా కన్నీటి ట్వీట్లు కురుస్తున్నాయి. -
నటి ఇంట్లోకి చొరబడి రచ్చ..!
పెరంబూరు: అనూహ్యంగా ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకుంటానంటూ ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ప్రముఖ బుల్లితెర నటిపై ఒత్తిడి చేసిన సంఘటన ఆ ప్రాతంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లితే రాజారాణి తదితర టీవీ సీరియళ్లలో నటిస్తూ ప్రాచుర్యం పొందిన నటి రితిక. ఈమె తన తండ్రితో కలిసి స్థానిక వడపళని, 100 అడుగుల రోడ్డు, మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలోని ఇంటి రెండో అంతస్తులో నివసిస్తోంది. ఇదిలాఉండగా గురువారం ఉదయం ఒక యువకుడు అనూహ్యంగా రితిక ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. నటి రిత్విక తండ్రి సుబ్రమణి వచ్చి తలుపు తీశాడు. ఆయనతో ఆ యవకుడు నటి రితిక అంటే తనకు ఇష్టం అని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ అనూహ్య పరిణామానికి దిగ్బ్రాంతికి గురైన నటి రితిక తండ్రి తేరుకుని అతన్ని వెళ్లిపొమ్మాని చెప్పాడు. అయినా ఆయన మాటలను లెక్క చేయకుండా రితికను పెళ్లి చేసుకుంటానని పటినపట్టు విడవకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నటి రితిక ఇంట్లోనే ఉంది. వారి గొడవ విని చుట్టు పక్కల వారు, ఇంటి సెక్యూరిటీ అక్కడకు చేరుకుని ఆ యువకుడిని వడపళని పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆ యువకుడిని విచారించారు. విచారణలో ఆ యువకుడు గోపిశెట్టి పాలయంకు చెందిన భరత్ అని తెలిసింది. ఇంజినీరింగ్ విద్యార్థి అయిన భరత్ ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చాడని, గురువారం ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అతను నటి రితిక ఇంట్లోకి చొరబడ్డాడని తెలిసింది. విచారణలో భరత్ తాను నటి రితికను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం... జనవరి 8న తిరిగి జట్టుతో చేరిక
భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఈనెల 3 నుంచి సిడ్నీలో ఆస్ట్రేలియాతో మొదలయ్యే చివరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితిక సజ్దే బిడ్డకు జన్మనివ్వడంతో... రోహిత్ మెల్బోర్న్ నుంచి ముంబైకి ప్రయాణమయ్యాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఈ నెల 8న అతడు తిరిగి జట్టుతో చేరతాడు. ‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న రోహిత్‌కు శుభాకాంక్షలు’ అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో అభినందనలు తెలిపింది. రోహిత్ స్థానంలో సిడ్నీ టెస్టుకు మరెవరినీ ఎంపిక చేయలేదని ప్రకటించింది. -
చహల్‌కు రోహిత్ భార్య పంచ్!
ముంబై: ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టీ 20 సిరీస్‌లోభాగంగా ఒక మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన రోహిత్.. వన్డే సిరీస్‌లో సైతం శతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అయినప్పటికీ టీమిండియా టెస్టు జట్టులో రోహిత్ శర్మకు సెలక్టర్లు చోటు కల్పించలేదు. దాంతో భారత్‌కు వచ్చిన రోహిత్ తన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత రోహిత్ తన భార్య రితికతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా..‘ మిస్ యూ రోహిత్’ అంటూ సహచర క్రికెటర్ యజ్వేంద్ర చహల్ రిప్లై ఇచ్చాడు. దీనిపై వెంటనే స్పందించిన రితిక.. ‘అతను ఇప్పుడు నా సొంతం’ అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు. -
లారెన్స్‌కు జంటగా రితిక
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్టెప్స్‌తో పోటీపడడానికి ఉత్తరాది భామ రితిక సిద్ధమవుతున్నారు. ఈమెకు పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదనుకుంటా. కారణం ఇరుదు చేట్రు చిత్రంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రితిక. రియల్ బాక్సర్ అయిన రితిక ఇరుదు చుట్రు చిత్రంలోనూ వీధి బాక్సర్ నుంచి వరల్డ్ బాక్సర్‌గా ఎదిగే పాత్రను అత్యంత సహజత్వంతో నటించి జాతీయ అవార్డును అందుకున్న ప్రతిభావంతురాలు రితిక. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీకి మరో లక్కీచాన్స్ వరించింది. ప్రముఖ దర్శకుడు పి.వాసు కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన సూపర్‌హిట్ చిత్రం శివలింగ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేయ సంకల్పించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంలో శివరాజ్‌కుమార్ పాత్రను రాఘవలారెన్స్ పోషించనున్నారు. ఈయనకు జంటగా నటి రితికను ఎంపిక చేశారు. దీని గురించి దర్శకుడు తెలుపుతూ శివలింగ చిత్రంలో హీరోయిన్‌ది హీరోకు దీటుగా ఉండే ప్రాముఖ్యత గల పాత్ర అన్నారు. ఈ పాత్రకు కొత్త నటి అవసరమైందన్నారు. ఇరుదు చుట్రు చిత్రంలో రితక నటన తనను మెప్పించిందన్నారు. తను తమిళంలో ఒక్క చిత్రమే చేశారు కాబట్టి శివలింగ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వివరించారు. తాను ఆమెకు సూచించింది ఒక్కటేనన్నారు. రాఘవలారెన్స్ అద్భుతమైన డాన్సర్ అనీ ఆయనతో పోటీ పడేలా డాన్స్ చేయడానికి శిక్షణ తీసుకోవాలని చెప్పానన్నారు. తనూ చాలెంజ్‌గా తీసుకుని నటిస్తానని మాట ఇచ్చారని అన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో తన కొడుకు శక్తివేల్‌వాసు కీలక పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. తమిళంలోనూ శివలింగ పేరుతోనే తెరకెక్కించనున్న ఈ చిత్ర షూటింగ్‌ను జూలై 14న బెంగళూర్‌లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. కనిపించకుండాపోయిన ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు. జవహర్‌నగర్‌లో నివసించే ఎ. శ్రీనిఖిత(21) హిందూ డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈ నెల 19నుంచి జరగనున్న పరీక్షల కోసం హాల్ టికెట్ తెచ్చుకుంటానని గురువారం ఉదయం మేనత్త కూతురు రితికతో కలసి వెళ్లింది. హాల్‌టికెట్ తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అన్ని ప్రాంతాలు గాలించారు. స్నేహితులు, బంధువులతో పాటు స్వగ్రామంలోనూ ఆరా తీసినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో కూడా వెళ్లిన రితిక కూడా కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షలు రాయడానికి వెళ్లి... బోరబండ ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్‌లో నివసించే బి. ఎలీష(20) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. చార్మినార్ వద్ద రాయల్ ఉమెన్స్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండటంతో గురువారం ఉదయం 7గంటలకు బస్సులో చార్మినార్ వెళ్లింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కావడంతో సాయంత్రం 5 అవుతున్నా ఎలీషా ఇంటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు శ్రీదేవికి ఫోన్ చేశారు. అయితే ఎలీషా పరీక్ష రాయడానికి రాలేదని శ్రీదేవి వెల్లడించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.