లారెన్స్‌కు జంటగా రితిక | Actor Lawrence act's with Ritika | Sakshi
Sakshi News home page

లారెన్స్‌కు జంటగా రితిక

Published Sat, Jun 25 2016 2:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

లారెన్స్‌కు జంటగా రితిక - Sakshi

లారెన్స్‌కు జంటగా రితిక

ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్టెప్స్‌తో పోటీపడడానికి ఉత్తరాది భామ రితిక సిద్ధమవుతున్నారు. ఈమెకు పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదనుకుంటా. కారణం ఇరుదు చేట్రు చిత్రంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రితిక. రియల్ బాక్సర్ అయిన రితిక ఇరుదు చుట్రు చిత్రంలోనూ వీధి బాక్సర్ నుంచి వరల్డ్ బాక్సర్‌గా ఎదిగే పాత్రను అత్యంత సహజత్వంతో నటించి జాతీయ అవార్డును అందుకున్న ప్రతిభావంతురాలు రితిక.

ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీకి మరో లక్కీచాన్స్ వరించింది. ప్రముఖ దర్శకుడు పి.వాసు కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన సూపర్‌హిట్ చిత్రం శివలింగ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేయ సంకల్పించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంలో శివరాజ్‌కుమార్ పాత్రను రాఘవలారెన్స్ పోషించనున్నారు. ఈయనకు జంటగా నటి రితికను ఎంపిక చేశారు.

దీని గురించి దర్శకుడు తెలుపుతూ శివలింగ చిత్రంలో హీరోయిన్‌ది హీరోకు దీటుగా ఉండే ప్రాముఖ్యత గల పాత్ర అన్నారు. ఈ పాత్రకు కొత్త నటి అవసరమైందన్నారు. ఇరుదు చుట్రు చిత్రంలో రితక నటన తనను మెప్పించిందన్నారు. తను తమిళంలో ఒక్క చిత్రమే చేశారు కాబట్టి శివలింగ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వివరించారు. తాను ఆమెకు సూచించింది ఒక్కటేనన్నారు. రాఘవలారెన్స్ అద్భుతమైన డాన్సర్ అనీ ఆయనతో పోటీ పడేలా డాన్స్ చేయడానికి శిక్షణ తీసుకోవాలని చెప్పానన్నారు.

తనూ చాలెంజ్‌గా తీసుకుని నటిస్తానని మాట ఇచ్చారని అన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో తన కొడుకు శక్తివేల్‌వాసు కీలక పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. తమిళంలోనూ శివలింగ పేరుతోనే తెరకెక్కించనున్న ఈ చిత్ర షూటింగ్‌ను జూలై 14న బెంగళూర్‌లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement