
ముంబై: ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టీ 20 సిరీస్‌లోభాగంగా ఒక మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన రోహిత్.. వన్డే సిరీస్‌లో సైతం శతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అయినప్పటికీ టీమిండియా టెస్టు జట్టులో రోహిత్ శర్మకు సెలక్టర్లు చోటు కల్పించలేదు. దాంతో భారత్‌కు వచ్చిన రోహిత్ తన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయితే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత రోహిత్ తన భార్య రితికతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా..‘ మిస్ యూ రోహిత్’ అంటూ సహచర క్రికెటర్ యజ్వేంద్ర చహల్ రిప్లై ఇచ్చాడు. దీనిపై వెంటనే స్పందించిన రితిక.. ‘అతను ఇప్పుడు నా సొంతం’ అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment