నటి ఇంట్లోకి చొరబడి రచ్చ..! | A Man Harrased Tv Actress Ritika In Her Residnce | Sakshi
Sakshi News home page

నటి ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకుంటానని రగడ

Published Fri, May 10 2019 9:22 AM | Last Updated on Fri, May 10 2019 9:22 AM

A Man Harrased Tv Actress Ritika In Her Residnce - Sakshi

పెరంబూరు: అనూహ్యంగా ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకుంటానంటూ ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రముఖ బుల్లితెర నటిపై ఒత్తిడి చేసిన సంఘటన ఆ ప్రాతంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లితే రాజారాణి తదితర టీవీ సీరియళ్లలో నటిస్తూ ప్రాచుర్యం పొందిన నటి రితిక. ఈమె తన తండ్రితో కలిసి స్థానిక వడపళని, 100 అడుగుల రోడ్డు, మెట్రో రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఇంటి రెండో అంతస్తులో నివసిస్తోంది. ఇదిలాఉండగా గురువారం ఉదయం ఒక యువకుడు అనూహ్యంగా రితిక ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు. నటి రిత్విక తండ్రి సుబ్రమణి వచ్చి తలుపు తీశాడు. ఆయనతో ఆ యవకుడు నటి రితిక అంటే తనకు ఇష్టం అని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఈ అనూహ్య పరిణామానికి దిగ్బ్రాంతికి గురైన నటి రితిక తండ్రి తేరుకుని అతన్ని వెళ్లిపొమ్మాని చెప్పాడు. అయినా ఆయన మాటలను లెక్క చేయకుండా రితికను పెళ్లి చేసుకుంటానని పటినపట్టు విడవకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నటి రితిక ఇంట్లోనే ఉంది. వారి గొడవ విని చుట్టు పక్కల వారు, ఇంటి సెక్యూరిటీ అక్కడకు చేరుకుని ఆ యువకుడిని వడపళని పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆ యువకుడిని విచారించారు. విచారణలో ఆ యువకుడు గోపిశెట్టి పాలయంకు చెందిన భరత్‌ అని తెలిసింది. ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన భరత్‌ ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చాడని, గురువారం ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అతను నటి రితిక ఇంట్లోకి చొరబడ్డాడని తెలిసింది. విచారణలో భరత్‌ తాను నటి రితికను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement