సిడ్నీ టెస్టుకు రోహిత్‌ దూరం... జనవరి 8న తిరిగి జట్టుతో చేరిక   | Rohit Sharma to return home after daughters birth, will miss Sydney Test | Sakshi
Sakshi News home page

సిడ్నీ టెస్టుకు రోహిత్‌ దూరం... జనవరి 8న తిరిగి జట్టుతో చేరిక  

Published Tue, Jan 1 2019 2:34 AM | Last Updated on Tue, Jan 1 2019 2:34 AM

Rohit Sharma to return home after daughters birth, will miss Sydney Test - Sakshi

భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఈనెల 3 నుంచి సిడ్నీలో ఆస్ట్రేలియాతో మొదలయ్యే చివరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితిక సజ్దే బిడ్డకు జన్మనివ్వడంతో... రోహిత్‌ మెల్‌బోర్న్‌ నుంచి ముంబైకి ప్రయాణమయ్యాడు.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఈ నెల 8న అతడు తిరిగి జట్టుతో చేరతాడు. ‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న రోహిత్‌కు శుభాకాంక్షలు’ అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో అభినందనలు తెలిపింది. రోహిత్‌ స్థానంలో సిడ్నీ టెస్టుకు మరెవరినీ ఎంపిక చేయలేదని ప్రకటించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement