సహాయ కార్యక్రమాల్లో సిద్దార్థ్
చెన్నైలో వర్షం కాస్త తగ్గటంతో సహాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితులపై అందరికంటే ముందుగా స్పందించిన హీరో సిద్దార్ధ్, తన సహాయ కార్యక్రమాలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వాడుకుంటున్నాడు. సాయం చేయాలనుకుంటున్న వారు తమను ఎలా సంప్రదించాలి, ఎంతమందికి సాయం చేయగలం లాంటి విషయాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
తమ వాలంటీర్లు ఇంటర్నెట్ యాక్సెస్తో సిద్ధంగా ఉన్నారంటూ తెలిపిన సిద్దార్థ్, పలు రకాల వాహనాలతో ఈ రోజంతా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ప్రకటించాడు. సోషల్ సైట్స్లో కొంతమంది లేనిపోని వదంతులు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపాడు. సరైన సమాచారం లేకుండా అలాంటి విషయాలను పోస్ట్ చేయొద్దని కోరాడు.
చాలాప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నందున వాటర్ బాటిల్స్ పంపించాలంటూ కోరాడు. అందుబాటులో వాహనాలు ఉన్నవారు ఆహార పొట్లాలు తీసుకువచ్చి.. పామ్ గ్రోవ్ హోటల్ ఎదురుగా ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ ఆఫీస్లో అందజేయాలని, వాళ్ల వద్ద వాహనాలు లేకపోతే.. తనకు సమాచరం అందిస్తే తామే వచ్చి కలెక్ట్ చేసుకుంటామన్నాడు.
Back in connectivity. We have trucks and vehicles going out all day today. Please use #ChennaiMicro to reach us. We need more supplies.
— Siddharth (@Actor_Siddharth) December 5, 2015
Only packaged food and snacks today PLEASE. Water bottles priority. Also lots of areas still need blankets. Please help. #ChennaiMicro
— Siddharth (@Actor_Siddharth) December 5, 2015
There is a lot or false information on social networks. Don't post without verification. It's a nuisance. Tweet responsibly. #ChennaiMicro
— Siddharth (@Actor_Siddharth) December 5, 2015
If you have vehicles drop off supplies to big fm office opposite palmgrove hotel. If you don't, we will come and pick up. #ChennaiMicro
— Siddharth (@Actor_Siddharth) December 5, 2015