మణిరత్నం సినిమాలో రేడియో జాకీ | RJ Balaji in Mani Ratnams next | Sakshi

మణిరత్నం సినిమాలో రేడియో జాకీ

Jul 5 2016 12:18 PM | Updated on Sep 4 2017 4:11 AM

వడకర్రీ, యాచ్చన్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న నటుడు బాలజీ.., గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ రేడియో జాకీ...

వడకర్రీ, యాచ్చన్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న నటుడు బాలజీ.., గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ రేడియో జాకీ నటించనున్నాడు. ఈ విషయం తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న బాలాజీ, ' ఇది నిజంగా జరిగింది. మణిరత్నం సినిమాలు చూస్తూ పెరిగా.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించబోతున్నా..! అంతా కలలా ఉంది'. అంటూ కామెంట్ చేశాడు.

ఓకె బంగారం సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న మణిరత్నం తాజాగా కార్తీతో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో కార్తీ స్లిమ్ లుక్ కనిపించనున్నాడు. కార్తీ సరసన అదితిరావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ శుక్రవారం నుంచి ఊటిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement