
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్‌లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.

కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్‌జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment