వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్‌ సాంగ్‌ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరోయిన్‌ | Shriya Saran And Surya Get One Special Song | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్‌ సాంగ్‌ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరోయిన్‌

Published Sat, Nov 23 2024 12:38 PM | Last Updated on Sat, Nov 23 2024 1:34 PM

Shriya Saran And Surya Get One Special Song

చిత్రపరిశ్రమలో ఐటమ్‌ సాంగ్స్‌కు చాలా క్రేజ్‌ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్‌లు అవకావం వస్తే కాదనకుండా ఓకే చెప్పుతున్నారు. ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న హీరోయిన్లు నటించిన ఐటమ్‌ సాంగ్స్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అలా ఇంతకు ముందు పుష్ప చిత్రంలో నటి సమంత పాటను, ఇటీవల జైలర్‌ చిత్రంలో తమన్నా పాటను చూశారు. ఈ తరహా పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ కావడంతో స్టార్‌ హీరో చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ ఉండడం పరిపాటిగా మారుతోంది. 

తాజాగా నటుడు సూర్య చిత్రంలోనూ ఒక అదిరిపోయే ఐటమ్‌ సాంగ్‌ చోటు చేసుకుంటోందని సమాచారం. కంగువ చిత్రం తరువాత ఈయన నటించిన తన 44వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. స్టోన్‌ బెంచ్‌ స్టూడియోస్‌ సంస్థ, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ కథా చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. 

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి స్టార్‌ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు కాస్త విరామం తీసుకున్నారు. ఈమె తమిళంలో చివరిగా 2017లో విడుదలైన అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత ఎక్కడా కనిపించని శ్రియ ఆ మధ్య కన్నడంలో ఉపేంద్రకు జంటగా ఒక చిత్రంలో నటించడంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటిది తాజాగా తమిళంలో ఏడేళ్ల తరువాత నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌తో మెరవనున్నట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. 

అయితే దీని గురించి నటి శ్రియ ఒక భేటీలో పేర్కొనడం విశేషం. ఈ పాట బాగా వచ్చిందని, త్వరలోనే వెలువడనుందనీ ఆమె తెలిపారు. అంతే కాదు ఈ పాటను గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈమె నటుడు సూర్యతో నటించిన తొలి చిత్రం ఇదే అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement