స్టార్‌ హీరోతో సినిమా ఛాన్స్‌... తిరిగొస్తున్న శ్రియ శరణ్‌ | Shriya Saran To Act In A New Film With Actor Suriya, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోతో సినిమా ఛాన్స్‌... తిరిగొస్తున్న శ్రియ శరణ్‌

Published Fri, Sep 13 2024 11:46 AM | Last Updated on Fri, Sep 13 2024 3:46 PM

Shriya Saran And Surya Will Confirm Movie

ఇప్పుడు సీనియర్‌ హీరోయిన్లకు మంచి టైమ్‌ నడుస్తుందనే చెప్పవచ్చు.  ఇంతకు ముందు అగ్ర హీరోయిన్‌లుగా రాణించిన సిమ్రాన్, జ్యోతిక,త్రిష, మంజూ వారియర్‌ వంటి నటీమణులకు ఇప్పుడు సౌత్‌ చిత్రపరిశ్రమలో మంచి డిమాండ్‌ పెరుగుతోందనే చెప్పాలి. ఇలాంటి వారికి  సీనియర్‌ నటులకు జంటగా నటించే అవకాశాలు వరిస్తున్నాయి.  అదే విధంగా చిరంజీవి, విజయ్‌, సూర్య, అజిత్‌ వంటి హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా తాజాగా నటుడు సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో నటి శ్రియ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ ఎలా ఉందంటే.. ?

ఈమె ఇంతకు ముందు తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో టాప్‌ కథానాయకిగా రాణించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌కు జంటగా శివాజీ చిత్రంలో నటించే స్థాయికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గపోయా యి. కొన్ని చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లోనూ నటించారు. అయితే వివాహానంతరం కాస్త గ్యాప్‌ వచ్చినా ఆమె నటనకు మాత్రం దూరం కాలేదు. ఈ క్రమంలో చిన్న సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ, అవి అంతగా ఆకట్టుకోలేదు. అలాంటిది తాజాగా నటుడు సూర్య హీరోగా నటిస్తున్న తన 44వ చిత్రంలో నటి శ్రియ నటిస్తున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. 

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్‌ మసాలా చిత్రంలో నాయకిగా నటి పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో నటి శ్రియ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రీసెంట్‌గా నటి శ్రియ ఒక సినిమా ఒప్పుకున్నారు. మాదేశ్‌ దర్శకత్వం వహిస్తున్న సండైక్కారి అనే చిత్రంలో ఆమె నటించనున్నారు. ఇందులో నటుడు విమల్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 31న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement