
ప్రగ్య జైస్వాల్‌కు శిక్షణ ఇస్తున్న కుల్‌దీప్ సేథీ...
‘స్టార్’ ట్రైనర్
కంచె సినిమాలో సున్నితమైన, ఊహాలోకపు కలలరాణిలా కట్టి పడేసిన నాజూకు అందాల ప్రగ్య జైస్వాల్... నమో వెంకటేశాయలో గ్లామర్ గాళ్‌గాను ‘తెర’ వెలిగింది. చక్కని ఫిజిక్‌తో ఆకట్టుకుంది. శరీరతత్వం గురించి సరైన అవగాహన, తీరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామమే ఆమె గ్లామర్ సీక్రెట్ అంటారు కుల్‌దీప్ సేథీ. కొన్ని నెలలుగా ఆమెకు వ్యాయామ శిక్షకులుగా వ్యవహరిస్తున్న కుల్‌దీప్ ఆమె వ్యాయామ, ఆహార అలవాట్ల గురించి చెబుతున్నారిలా...
ఎక్టోమార్ఫ్ బాడీ
ప్రగ్య జైస్వాల్‌ది ఎక్టోమార్ఫ్ బాడీ టైప్. ఇలాంటి శరీరతత్వం ఉన్నవాళ్లకి మెటబాలిజం చాలా ఎక్కువ. దీంతో వీళ్ల బాడీ ఫ్రేమ్ లీన్‌గా థిన్‌గా ఉంటుంది. సరైన ఫుడ్ తినకపోయినా, రెగ్యులర్‌గా వర్కవుట్ చేయకపోయినా ఆ ప్రభావం వీరి మీద బాగా పడుతుంది. వీక్‌గా, డల్‌గా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాడీ టైప్‌కి ఫుడ్, వర్కవుట్స్ తప్పనిసరి. అయితే తమ బాడీ టైప్‌కి తగని వర్కవుట్ మితి మీరి చేస్తే కూడా వీక్‌గా కనపడతారు. అందుకని ప్రగ్యకు కార్డియో వర్కవుట్స్ ఎక్కువ సజెస్ట్ చేయను. ఆమె దేహానికి అవసరమైన స్ట్రెంగ్త్ ట్రయినింగ్, కోర్ ఎక్సర్‌సైజెస్ ఎక్కువ చేయిస్తుంటాను.
దీని వల్ల మంచి మజిల్ బిల్డప్ అవడంతో పాటు టోన్డ్ బాడీని మెయిన్‌టెయిన్ చేయగలుగుతున్నారామె. రోజుకు 45 నిమిషాల నుంచి గంట వరకూ వ్యాయామం చేయిస్తాను. మిగతా పార్ట్స్ ఎలా ఉన్నా లోయర్ బాడీ వర్కవుట్ తప్పకుండా చేయిస్తాను. ఎందుకంటే ఫ్యాట్‌ని ఖర్చుపెట్టడంలో లోయర్ బాడీ వర్కవుట్స్ చాలా కీలకం. లెగ్స్, బ్యాక్ వంటి పెద్ద మజిల్ గ్రూప్స్‌కి వ్యాయామం అందించినప్పుడు బాగా కేలరీలు ఎక్కువ ఖర్చు చేస్తాం. ఆమె కాళ్లు పొడవు కావడం వల్ల కూడా ఆమెకి లోయర్‌పార్ట్ వర్కవుట్స్‌కి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.
కార్బోహైడ్రేట్స్ కూడా
తన ఆహారంలో నాణ్యమైన ప్రొటీన్ పుడ్‌తో పాటు తన బాడీ టైప్‌కి అవసరమైన కార్బొహైడ్రేట్స్ కూడా తగినంత ఉండేలా చూస్తాను. ఆమె మెటబాలిజం రేట్ చాలా ఎక్కువ కాబట్టి... ఉదయం మాత్రమే కాదు ఎర్లీ ఈవెనింగ్ కూడా కార్బొహైడ్రేట్స్‌ని ఆమె తీసుకోవచ్చు. ఆమె తగినంత బాడీ వెయిట్ మెయిన్‌టెయిన్ చేయాల్సిఉంది. ప్రస్తుతం ఆమె థిన్‌గా, ఫిట్‌గా ఉంది. ఇంతకుమించి బరువు తగ్గకూడదు. ఇక బాగా ఫ్రూట్స్‌తో పాటు వే ప్రొటీన్ రోజుకు ఒక స్కూప్ జత చేస్తాం. తండూరి, గ్రిల్డ్... చికెన్, ఫిష్... తగినంత వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఇక ఆమె షూటింగ్ కారణంగా నగరంలో లేకపోతే... ఓట్‌మీల్ తీసుకోమని చెబుతాను. అలాగే ఎగ్‌వైట్స్, దాల్, కర్డ్, పాలక్... పన్నీర్, బ్రౌన్ రైస్ దొరకకపోతే బ్రెడ్, వైట్‌రైస్ కూడా సూచిస్తాను. ఏదేమైనా... పరిమాణం మాత్రం పరిమితిగా ఉండాలి. కడుపు నిండేలా తినడం మంచిది కాదు. రోజుకు 5 సార్లు విభజించుకుని తీసుకోవడం అవసరం. అందుబాటులో లేనప్పుడు వాట్సప్ ద్వారా వర్కవుట్స్ సూచిస్తాను. జిమ్ దగ్గరలో లేకపోతే బాడీ వెయిట్ ఎక్సర్‌సైజ్‌లైన ఫ్రీస్క్వాట్స్, లోయర్ యాబ్స్, క్రంచెస్, ప్లాంక్ వంటివి చేయమని చెబుతాను.
ప్రగ్య జైస్వాల్‌కు శిక్షణ ఇస్తున్న కుల్‌దీప్ సేథీ...
ప్రగ్య జైస్వాల్‌తో...కుల్‌దీప్ సేథీ
సమన్వయం: సత్యబాబు