చిరు సినిమాలో ఛాన్స్? వర్కౌట్ వీడియోతో హీరోయిన్ సర్‌ప్రైజ్! | Naa Saami Ranga Movie Actress Ashika Ranganath Latest GYM Workout Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ashika Ranganath GYM Video: బాడీని ఎలా పడితే అలా వంచేసిన ముద్దుగుమ్మ

Published Wed, Feb 21 2024 2:23 PM | Last Updated on Wed, Feb 21 2024 2:59 PM

Actress Ashika Ranganath Workout Video Latest - Sakshi

కన్నడ బ్యూటీ షాక్ ఇచ్చింది. సినిమాల్లో వయ్యారంగా కనిపించి, యాక్టింగ్‌తో ఇరగదీసిన ఈ హీరోయిన్.. జిమ్‪‌లో వావ్ అనేలా రెచ్చిపోయింది. సరిగ్గా చెప్పాలంటే శరీరాన్ని ఎటు పడితే అటు వంచేసి అందరూ నోరెళ్లబెట్టి చూసేలా చేసింది. ఇకపోతే ఈ బ్యూటీకి చిరు కొత్త సినిమాలో ఆఫర్ వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడీ విషయం మెగా ఫ్యాన్స్ మధ్య డిస్కషన్‌కి కారణమైంది.

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. గతేడాది 'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాఫ్ అయింది. కానీ నాగార్జున 'నా సామి రంగ' చిత్రంలో ఈమె వరాలు అనే పాత్ర చేసింది. రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా మాత్రం ఆషిక అదరగొట్టేసింది. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?)

అలా యాక్టింగ్ పరంగా అలరిస్తున్న ఆషికకు తాజాగా చిరు 'విశ్వంభర'లో అవకాశమొచ్చిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. సరే ఇదంతా వదిలేస్తే చుడటానికి సుకుమారంగా ఉండే ఆషిక.. జిమ్‌లో మాత్రం మొత్తం రఫ్ అండ్ టఫ్‌గా అల్లాడించేసింది. ఇందుకు సంబంధించిన వర్కౌట్ వీడియోని తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూస్తున్నంతసేపు చేస్తున్న ఆషికకు ఏమో గానీ మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వర్కౌట్ అలా ఉంది. మరి ఈ వర్కౌట్ అంతా చిరు సినిమా కోసమా లేదంటే వేరే ఏదైనా మూవీ కోసమా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుందిలే.

(ఇదీ చదవండి: 'టిల్లు 2' కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ.. ఎంతిచ్చారో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement