బాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే నటులలో ఒకరు హృతిక రోషన్. ఆయన వైవిధ్యభరితమైన నటనకు గానూ ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల తోసహా ఇతర అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఎంతో స్టైలిష్‌గా ఉంటే హృతిక్‌కి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో క్రేజ్ ఉంది. ఆయన ఫిట్‌నెస్ బాడీకి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే. అంతలా కండలు తిరిగిన దేహంతో ఓ యోధుడిలా ఉంటాడు. ఐదు పదుల వయసులో కూడా ఆయన అంతే యంగ్‌గా ఫిట్‌గా ఎలా మెయింటైన్ చేస్తున్నాడా అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే దీనికి మాములు డెడీకేషన్ సరిపోదు మరీ..
హృతిక్ కండలు తిరిగిన దేహం వెనుక ఎంతో శ్రమ, కఠిన వర్కౌట్‌లు ఉంటాయి. ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి వర్కౌట్‌లు చేస్తాడో తెలిస్తే మతిపోవడం ఖాయం. అతడు చెమటలు పట్టేలా చేసే.. బరువులు(లాగడం/ఎత్తడం)తో కూడిన వ్యాయామాలు చూస్తే మనకే నొప్పులొచ్చేస్తాయి. అవి చెమటోడ్చి పనిచేసే వాళ్ల మాదిరిగా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే మూటలు ఎత్తేవాళ్లు చేసేవిలా ఉంటాయి.
అవి అలాంటి ఇలాంటి కఠినమైన వ్యాయామాలు కాదు. వెయిట్‌లిఫ్ట్ క్రీడాకారులు మాదిరిగా ఉంటాయి. చూస్తే మాత్రం..ఇంతలానా వర్కౌట్‌లు అని నోరెళ్లబెడతారు. ఈ కొత్త ఏడాది తన వ్యాయమాల ప్లాన్ ఏంటీ అంటూ క్యాప్షన్‌తో తన వర్కౌట్ల సెషన్ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాడు. ఆ వీడియోల్లో చాలా నొప్పితో కూడిన జిమ్ ఎక్స్‌ర్‌సైజుల చూస్తే బాబోయ్ అనిపిస్తుంది. కష్టం, నొప్పితో కూడిని ఈ కఠినతరమైన వ్యాయామాలతోనే నటుడు హృతిక్ ఇంతలా బాడీ మెయింటెయిన్ చేస్తున్నాడా అని విస్తుపోతారు.
అందుకు చాలా గట్టి నిబద్ధత కావాలి. ఇంతలా మనసు పెట్టి చేస్తున్నాడు కాబట్టి అతడికి అంతమంది అభిమానులు కాబోలు అనిపిస్తుంది. ఈ శరీరాకృతి కారణంగానే హృతిక్‌కి మంచి మంచి రోల్స్(క్యారెక్ట్‌ర్స్) వచ్చాయి. ముఖ్యంగా క్రిష్ సినిమాలో కండలు తిరిగిన దేహంతో చేసే ఫైటింగ్‌లు, అద్భుతాలు ప్రేక్షకుల్ని కళ్లప్పగించి చూసేలా చేస్తాయి. తన కష్టానికి ప్రతిఫలమే ఈ స్టార్‌డమ్ అని చెప్పొచ్చు. ఏదీ ఏమైన హృతిక్ డెడికేషన్‌కి సలాం కొట్టాల్సిందే కదూ..!
(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment