
న్యూయార్క్ : ఒకరు చూస్తే రెండుసార్లు ఒలింపిక్స్‌లో పోటీ పడిన అథ్లెట్, మరొకరేమో మోడల్ కమ్ అథ్లెట్.. వీరిద్దరు చేసిన వర్కవుట్ చాలెంజ్‌లో ఎవరు విజేతగా నిలిచారనేది మాత్రం వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మిడిల్ ట్రాక్ డిస్టెన్స్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న అమెరికన్ అథ్లెట్ నిక్ సిమ్మండ్స్ సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నాడు. ఆటకు రిటైర్మంట్ ప్రకటించిన తర్వాత యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిటనెస్‌పై సూచనలు, సలహాలు అందిస్తున్నాడు.
తాజాగా తన లాగా వర్కవుట్ చేయాలంటూ ఇన్‌స్టాగ్రామ్ మోడల్ కమ్ అథ్లెట్ క్లారీ పి థామస్‌ను ఆహ్వానించాడు. నిక్ అడిగిన వెంటనే క్లారీ థామస్ వర్కవుట్ చాలెంజ్‌కు ఒప్పుకుంది. కాగా క్లారీ థామస్‌కు ఇన్‌స్టాలో దాదాపు 7.7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సహజంగానే మంచి అథ్లెట్ అయిన ఆమె వర్కవుట్స్‌లో నిక్‌ను మించి ప్రదర్శన నమోదు చేసింది. ' నేను సహజంగానే అథ్లెట్‌ను.. మోడల్‌గా కంటే అథ్లెట్‌గా ఉండడానికే ఎక్కవగా ఇష్టపడుతా' అంటూ పేర్కొంది.
పుల్ అప్స్ నుంచి మొదలుకొని రోఫ్ క్లైంబింగ్ వరకు క్లారీ నిక్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఇద్దరిలో ఎవరు గెలిచారనేది మాత్రం వీడియో చూసి తెలుసుకోవాల్సిందే. నిక్ ఈ వీడియోనూ తన యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 2లక్షలకు పైగా వీక్షించారు. ఇద్దరు పోటాపోటీగా వర్కవుట్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 'ఇది చూడడానికి ఫన్‌గా అనిపిస్తున్నా.. మీరు మాకు ఆదర్శంగా నిలిచారు' అంటూ కామెంట్లు పెడతున్నారు.
(జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి)
(ఆయన నాపై అత్యాచారం చేశారు)
Comments
Please login to add a commentAdd a comment