సో బ్యూటిఫుల్‌..సో ఎలిగెంట్‌: నటి ఫిట్‌నెస్‌ జర్నీ , ఫ్యాన్స్‌ ఫిదా | Actress Sonam Kapoor Stuns Fans With Her Amazing Weight Loss Journey, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Sonam Kapoor Weight Loss Journey: సో బ్యూటిఫుల్‌..సో ఎలిగెంట్‌: నటి ఫిట్‌నెస్‌ జర్నీ , ఫ్యాన్స్‌ ఫిదా

Published Thu, Jan 18 2024 2:04 PM | Last Updated on Thu, Jan 18 2024 3:26 PM

actress Sonam Kapoor amazing weight loss journey fans stuns - Sakshi

చాలామంది మహిళల్లో  ప్రెగ్నెన్సీలో బాగా బరువు పెరుగుదల కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే గర్భధారణకు ముందు  ఆ తరువాత అన్నట్టు తయారవుతుంది మహిళల ఫిట్‌నెస్‌ పరిస్థితి.  ప్రసవం తరువాత సహజంగా బరువు తగ్గడం అనేది  చాలా కొద్దిమందికి మాత్రమే  సాధ్యం.  మళ్లీ మునుపటి  స్థాయికి చేరాలంటే  అంత సులభం కాదు. చేయాల్సిన కసరత్తు చాలానే  ఉంటుంది ఒకవైపు బిడ్డకు తల్లిపాలు, ఆలన పాలనా చూసుకుంటూనే  తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా  ఆరు నెలలనుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చు. కానీ బాలీవుడ్‌ నటి  సోనమ్‌ కపూర్‌  మూడు నెలల్లో  20 కేజీలు బరువు అందర్నీ ఆశ్చర్యపరిచ్చింది.  2022లో మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ  గురించి చెప్పుకొచ్చింది. 


ప్రసవానంతర బరువు తగ్గే  క్రమంలోన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్‌ పిక్స్‌ షేర్‌ చేసింది. ఇన్‌స్టాలో  35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు  ఈ నటి  “వావ్.. 20 కిలోలు తగ్గాను ... ఇంకా 6  కిలోలు తగ్గాలి అంటూ  చెప్పుకొచ్చింది.మళ్లీ తనలా   మారడానికి  16 నెలలు పట్టిందనే విషయాన్ని  చెబుతూ   లెహంగాలో అమేజింగ్‌లుక్‌లో  ఉన్న కొన్ని చిత్రాలను ఫ్యాన్స్‌కు షేర్‌ చేసింది.ఎటువంటి క్రాష్ డైట్‌లు , క్రేజీ వర్కౌట్‌లు లేకుండానే తనని తాను,  కొడుకును  చూసుకుంటూ  నిదానంగా  ఈ స్థాయికి వచ్చానంటూ తన జర్నీ గురంచి పోస్ట్‌  చేసింది.దీంతో  ఫ్యాన్స్‌ వావ్‌.. అద్భుతం అంటూ కమెంట్‌  చేశారు.

View this post on Instagram

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

 కాగా   వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను  2018లొ వివాహం చేసుకుందిసోనమ్‌.నటి చివరిగా 'బ్లైండ్ మూవీలో  కనిపించిన  ఈమె  మంచి స్క్రిప్ట్‌తో  ఉంటే  OTT ప్లాట్‌ఫారమ్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల ప్రకటించింది.మంచి కంటెంట్ ,మంచి సినిమాలో భాగం కావడం తనకు ముఖ్యమని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement