నియమిద్దామా..వద్దా? | Government thinking to fill the District Manager post | Sakshi
Sakshi News home page

నియమిద్దామా..వద్దా?

Published Tue, Nov 19 2013 6:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Government thinking to fill the District Manager post

 కలెక్టరేట్, న్యూస్‌లైన్:  జిల్లాలోని ఈసేవ కేంద్రాల పనితీరును పర్యవేక్షించే ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టు భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారడంతో ప్రస్తుతం నియామకం చేపడదామా? వద్దా? అనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నియమిద్దామా..వద్దా?  ప్రక్రియ చేపట్టిననాటి నుంచి అంతా అయోమయ పరిస్థితి నెలకొనడంతో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక అధికారులు ప్రస్తుతం ఓ అభ్యర్థిని ఎంపికచేసినా నియామక ఉత్తర్వులను జారీచేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని మొదటి నుంచి ఏం జరుగుతుందోననే కథనంతో ‘సాక్షి’ ప్రధానంగా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు ఎంపికను జాగ్రత్తగా చేపడుతున్నారు. కానీ పోస్టు భర్తీ ప్రక్రియ మాత్రం రోజుకో మలుపు తిరుగుతుండటంతో చివరికి భర్తీ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వారం రోజుల్లో పూర్తిచేస్తామని గతనెలలో చెప్పిన అధికారులు రెండునెలలైనా ఇంతవరకు పూర్తిచేయడంలో విఫలమయ్యారు.
 నాన్‌లోకల్ అభ్యర్థి చేరికపై గందరగోళం
 ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు ముం దుగా గడువులోగా ‘ఆన్‌లైన్’లో రూ 100 చెల్లిం చాలని, వారినే అర్హుల గుర్తిస్తామని అధికారు లు నిబంధనవిధించారు. అలా రుసుం చెల్లిం చిన వారిలో 63 మంది అభ్యర్థులు ఉన్నారు. కా నీ తెలంగాణేతర ప్రాంతానికి చెందిన అభ్యర్థి శ్రీనివాస్‌అమర్ ఎలాంటి రుసుం చెల్లించకుం డానే నేరుగా రాతపరీక్షకు ఎంపికకావడం పట్ల అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇక ఈఅభ్యర్థిని ఎంపికచేద్దామని భావించిన అధికారులు ఆఖరు నిమిషంలో నాన్‌లోకల్ అనే ధోరణితో వెనక్కితగ్గినట్లు ఎంపికైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అభ్యర్థి విషయం లో ఎవరు ఎందుకంతా శ్రద్ధ తీసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై మి గిలిన అభ్యర్థులు ప్రస్తుతం ఆరాతీసే పనిలోపడ్డారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం ఎంపికచేసిన జి.చంద్రశేఖర్ అనే అభ్యర్థికి నాలుగున్నరేళ్ల అనుభవం మాత్రమే ఉందని, అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న వారిని పక్కనపెట్టి అధికారులు అన్యాయం చేశారని శ్రావణ్ అనే అభ్యర్థి వాపోయాడు. ఈ విషయమై అధికారులను అడిగేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో ఆవేదనను చెప్పుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement