ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై అబద్ధాలు మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు మంచిదికాదని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై అబద్ధాలు మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు మంచిదికాదని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. బుధవారం ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తమ్మిడిహెట్టి వద్ద 1,144 టీఎంసీల నీటిలభ్యత ఉందని కేసీఆర్ శాసనసభలోనే అంగీకరించారని.. 1,144 టీఎంసీల నుంచి 170 టీఎంసీలు తీసుకున్నా ఇంకా 950కి పైగా టీఎంసీలు సముద్రంలోనే కలుస్తాయన్నారు. మన అవసరాల కన్నా ఎక్కువ లభ్యత ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి నుంచి బ్యారేజీ మార్చడానికి కేసీఆర్ రీడిజైన్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టివద్దే ప్రాజెక్టును ప్రతిపాదించేలా వ్యాప్కోస్ సర్వే సంస్థచేత దివంగత నేత వైఎస్ చెప్పించారంటూ అబద్ధాలను చెప్పడం ఎందుకని ప్రశ్నించారు.