
సాక్షి, హైదరాబాద్: లోఫర్లు ఎవరో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు మంత్రి కేటీఆర్ సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకున్న కేటీఆర్.. కేసీఆర్ రాజకీయం ఎక్కడ ప్రారంభించారో తెలుసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్‌లోనే చాలాకాలం పాటు కేసీఆర్ పనిచేశారని, ఆయన కూడా లోఫరేనా అని ప్రశ్నించారు. ఎవరు లోఫర్లో తేల్చుకోవడానికి అమరవీరుల స్మారక స్తూపం దగ్గరైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment