కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారు
-
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్
నెల్లూరు(వేదాయపాళెం) : విక్రమ సింహపురి యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకంలో చోటుచేసుకున్న అవినీతిపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు విచారణ జరపారన్నారు. వర్సిటీ మూసివేతకు సిఫార్సు చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన వర్సిటీ ఆయన మరణాంతరం అవినీతిమయంగా మారిందన్నారు. మంత్రి నారాయణ దృష్టికి ఈ విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లినా ఆయన తగిన రీతిలో స్పందించటం లేదన్నారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.హరికృష్ణయాదవ్, బి.సత్యకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి టి.వినీల్, కార్యదర్శి సుమంత్, నాయకులు రాహుల్, తరుణ్‌లు పాల్గొన్నారు.