YSR Students Union
-
వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలోని యూనివర్సిటీలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌లను నియమించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా బీ. మోహన్ నియమితులయ్యారు. నాగార్జున వర్సిటీ ఇంఛార్జ్‌గా కిరణ్ నియమితులు కాగా, కాకినాడ జేఎన్టీయూ, కేఎల్ వర్సిటీల బాధ్యతలను కే రాజశేఖర్‌లకు అప్పగించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా పీ, మురళీ, ఎస్కేయూ, రాయలసీమ, విక్రమసింహపురి వర్సిటీలకు జీ లింగారెడ్డిను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
25న జిల్లా కేంద్రాల్లో ఫీజుపోరు: YSRSU
-
నిరుద్యోగ దీక్షా శిబిరం తొలగింపు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విద్యార్థి సంఘం నేతలు నిరుద్యోగ దీక్షలకు దిగారు. పలుచోట్ల పోలీసులు నిరుద్యోగ శిబిరాలను తొలగించి దీక్షలకు ఆటంకం కల్పించారు. మరికొన్ని చోట్ల విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతపురం: జిల్లాలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలు తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించారు. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వందలాది మంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే కోపమెందుకని విద్యార్థులు మండిపడ్డారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం పరామర్శించారు. పోలీసుల చర్యను వారు ఈ సందర్భంగా తప్పుబట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో మరోసారి చంద్రబాబు మోసానికి తెరలేపారని, రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసినట్టే నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారని వైస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్. సిద్దారెడ్డి ఆరోపించారు. టూటౌన్ పీఎస్‌లో వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం తదితరులు పరామర్శించారు. విజయవాడ : వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరుద్యోగ దీక్షకు ధర్నా చౌక్‌లో పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష ప్రారంభించిన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు. పశ్చిమగోదావరి జిల్లా: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలకు దిగారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ, ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆళ్ల నాని ప్రారంభించారు. తిరుపతి: ఎస్వీయూలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నిరసన దీక్ష. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు. చిత్తూరు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టాడని విమర్శించారు. అందువల్లే రాష్ట్రంలో పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య ఏర్పడిందని ధ్వజమెత్తారు. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయలేదు..ఔట్ సోర్సింగ్ పోస్టులను కుడా టీడీపీ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా: నిరుద్యోగ సమస్యలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో 48 గంటల దీక్షలు. దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా. దీక్షలో పాల్గొన్న విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజారహతుల్లా, యోగివేమన యూనివర్సిటీ విద్యార్థులు. కర్నూలు: విద్యా, ఉద్యోగం , నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష . కృష్ణ దేవరాయ సర్కిల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త బి.వై. రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరిత, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ తదితరులు. విశాఖపట్నం: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు కాంతారావు, సురేష్, గోవింద్ ఆధ్వర్యం లో 48 గంటల నిరాహార దీక్ష. విద్యార్థి సంఘ నేతల దీక్షలను ప్రారంభించిన నగర అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్. పాల్గొన్న విద్యార్థి సంఘం నేతలు సుధీర్, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్‌తో పాటు విద్యార్థులు . సంఘీభావం తెలిపిన కన్వీనర్లు తిప్పల నాగిరెడ్డి, డాక్టర్ రమణ మూర్తి, చెట్టి ఫాల్గుణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు పీలా వెంకట లక్ష్మీ, కొయ్యా ప్రసాద్ రెడ్డి, కొండ రాజీవ్ గాంధీ, బోని శివరామకృష్ణ తదితరులు. -
నారాయణను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలి
కడప ఎడ్యుకేషన్: మంత్రి నారాయణవి విద్యాసంస్థలు కావని, ఆవి కారాగారాలని పిల్లల ప్రాణాలను హరించే చెరశాలలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ మంత్రి నారాయణపై ధ్వజమెత్తారు. కడప నగరంలో మంగళవారం వైఎస్సాఆర్ స్టూడెంట్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా ఆధ్వర్యంలో సంధ్య సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు మంత్రి నారాయణ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక క్లాస్రూముకు 60 మంది ఉండాల్సి ఉంటే నారాయణ కళాశాలల్లో మాత్రం వందమందికి పైగా ఉంటున్నారన్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. ఎంతమంది విద్యార్థులు చనిపోయినా నారాయణ విద్యాసంస్థల అధిపతి మంత్రి నారాయణపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రపదవి నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. తిరుపతిలో మనోజ్‌కుమార్, సాయిచరణ్నాయక్లు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కేసుమాత్రం ముందుకు సాగడం లేదన్నారు. అసలు వారివి హత్యలా లేక ఆత్మహత్యలా అనేవి ప్రశ్నలుగా మిగిలిపోయాయన్నారు. ఇదే సమస్య ఓ సాధారణ కళాశాలలో జరిగితే ఇలాగే ప్రభుత్వం వ్యవహరించేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదు కడప, నెల్లూరు. గుంటూరు. కర్నూల్‌తోపాటు రాష్ట్రం మొత్తం మీదే ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. నారాయణ ధనదాహానికి పసిమొగ్గలు నేలరాలుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల కేసులో న్యాయం చేయాలని అడిగిన వైఎస్సార్ విద్యార్థిసంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. విద్యార్థుల భవిషత్తు కోసం మేము జైలు కెళ్లడానికైనా సిద్ధమన్నారు. కానీ తల్లితండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించి పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ నాయకులు మాసిన్, గంగాధర్, విజయ్, రహీమ్, శ్రీనాద్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్‌కు పరికరాలేవీ?
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ధర్నా నెల్లూరు (టౌన్): విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ శ్రీచైతన్య కళాశాల్లో ప్రాక్టికల్స్‌కు కనీసం పరికరాలు కూడా లేవని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు శేషు తెలిపారు. గురువారం స్థానిక రామలింగాపురంలోని శ్రీచైతన్య కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల్లో సగం మంది విద్యార్థులకు కూడా సరిపడా పరికరాలు లేవన్నారు. అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఒక క్యాంపస్‌లో ఉన్న పరికరాలను మరో క్యాంపస్‌లోకి తీసుకెళ్లి ప్రాక్టికల్స్‌ను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి ల్యాబ్‌ల పేరుతో ప్రత్యేకంగా ఫీజలు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ జరుగుతాయని విద్యాశాఖాధికారులు చెప్పినా కళాశాల యాజమాన్యం నేటికీ పరికరాలను అందుబాటులో ఉంచకపోవడం దారుణమన్నారు. కళాశాల్లో ఎలాంటి ప్రయోగాలు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారు
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నెల్లూరు(వేదాయపాళెం) : విక్రమ సింహపురి యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకంలో చోటుచేసుకున్న అవినీతిపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు విచారణ జరపారన్నారు. వర్సిటీ మూసివేతకు సిఫార్సు చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన వర్సిటీ ఆయన మరణాంతరం అవినీతిమయంగా మారిందన్నారు. మంత్రి నారాయణ దృష్టికి ఈ విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లినా ఆయన తగిన రీతిలో స్పందించటం లేదన్నారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.హరికృష్ణయాదవ్, బి.సత్యకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి టి.వినీల్, కార్యదర్శి సుమంత్, నాయకులు రాహుల్, తరుణ్‌లు పాల్గొన్నారు. -
వైవీయూ ఫలితాలు విడుదల చేయండి
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి సమాఖ్య∙నాయకులు కోరారు. శనివారం వైవీయూలో రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎ. ఖాజారహమతుల్లా మాట్లాడుతూ వైవీయూ డిగ్రీ పరీక్షలు పూర్తయి దాదాపు ఆరునెలలైందన్నారు. ఫలితాల అనంతరం రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నేటికీ ఫలితాలు విడుదల చేయలేదన్నారు. దీనివల్ల ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు పొందాలనుకున్న వారువిద్యాసంవత్సరం కోల్పోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల వెంటనే ఫలితాలు విడుదల చేయాలని కోరారు. వైవీయూ రీసెట్ విడుదల చేయాలని, విశ్వవిద్యాలయంలోని జిమ్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్అలీ, వైవీయూశాఖ అధ్యక్షుడు వినయ్‌కుమార్, రహీం, అమర్, నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్లను రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు, రాయచోటి, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఆర్అండ్బి అతిథిగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రిషితేశ్వరి లాగా ఏ విద్యార్థినిలు ర్యాగింగ్ భూతానికి బలికాకూడదన్నారు. ఆమె తల్లిదండ్రుల గర్భశోకం మరొకరికి కలగకూడదన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి తిరుపాల్‌రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, జెడ్పీటీసీలు సుదర్శన్‌రెడ్డి, సురేష్‌యాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు పి. ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వాలి
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హాస్టల్ విద్యార్థులకు సన్నిబియ్యంతో ఆహారాన్ని అందించాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బండి పరశురామ్ డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి సంఘం నాయకులతో కలసి మంగళవారం రాత్రి ఆయన హిందూపురంలోని ముక్కడిపేట బీసీ, ఎస్సీ హాస్టల్లో నిద్రించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. వార్డెన్లు స్థానికంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం చేయాలి
♦ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్‌కు జగన్ సూచన ♦ ‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్ : విద్యా సంస్థల్లో ర్యాగింగ్ రక్కసి చెలరేగి రిషితేశ్వరి, మధువర్ధన్‌రెడ్డి లాంటి అమాయకులు బలవుతున్న తరుణం లో ర్యాగింగ్‌పై పోరాటానికి వైఎస్సార్ స్టూడెం ట్స్ యూనియన్ ఏపీ విభాగం నడుంకట్టింది. ‘స్టాప్ ర్యాగింగ్’ శీర్షికతో ఒక పోస్టర్‌ను రూపొందించింది. ‘ర్యాగింగ్ శిక్షార్హమైన నేరం’ అనే నినాదాన్ని ప్రధానంగా ముద్రించిన ఆ పోస్టర్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ వల్ల అమాయకులు బలికాకుండా కృషి చేయాలని విద్యార్థి నేతలను జగన్ కోరారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చైతన్య పర్చాలని ఆయన సూచించారు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, ఇతర విద్యార్థి నేతలు ఆర్.రాకేష్‌రెడ్డి, బి.కాంతారావు, పి.చైతన్య, టి.అనిల్‌కుమార్, వై.నాగార్జున యాదవ్, సురేష్, వి.శ్రీకాంత్, డి.రవీంద్ర, డి.పూర్ణసాగర్, కె.నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
కదం తొక్కిన విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో పలు ప్రవేటు పాఠశాలలతోపాటు కళాశాలలు విద్యార్థుల నుంచి చేస్తున్న అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా శుక్రవారం కడపలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ పెద్ద పెత్తున అందోళన చేసింది. వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధక్షుడు ఖాజా రహ్మతుల్లా అధ్వర్యంలో 2 వేల మంది విద్యార్థులతో కడప నగరంలో పలు ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించటంతోపాటు కోటిరెడ్డి కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రవేటు పాఠశాలలతోపాటు కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారు. సంబంధిత విషయాన్ని పలుమార్లు డీఈఓ, ఆర్జేడీల దృష్టికి తీసికెళ్లినా స్పందన కరువైయిందన్నారు. డీఈఓ ప్రతాప్‌రెడ్డి ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పలు ప్రవేటు విద్యాసంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. గతేడాది పదికి పది మార్కులు వచ్చిన విద్యార్థులు జిల్లాలో 70 మంది ఉంటే ఈ ఏడాది ఒక్క రాయచోటిలోనే పదికి పది 70 మందికి వచ్చాయన్నారు. అది ఎలా సాధ్యమైయిందో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. డీఈఓను సస్పెండ్ చేయాలి: కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా యాజమాన్యంతో ముడుపులు తీసుకుని దానికి అనుమతి ఇచ్చారన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం నుంచి లక్షల్లో ముడుపులు తీసుకుని పాఠశాలలకు అనుమతులు లేకున్నా పట్టించుకోవటం లేదన్నారు. డీఈఓకు, ఆర్ఐఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోటిరెడ్డి సర్కిల్ చూట్టూ ప్రదర్శనలు చేశారు. డీఈఓను సస్పెండ్ చేయాలని గట్టిగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ స్టూడెంట్ జిల్లా యూత్ ప్రసిడెంట్ చల్లా రాజశేఖర్, వైఎస్ఆర్ యూత్ రాష్ట్ర జనరల్‌సెక్రెటరీ హరీస్‌కుమార్‌యాదవ్‌లు మద్దతును ప్రకటించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక వసూళ్ల చేసే పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా కార్యదర్శి జశ్వంత్‌రెడ్డితోపాటు నాయకులు మహమ్మద్ అలీ, నిత్య పూజయ్య, యాసిన్, విజయ్, కరీముల్లా, పెంచలయ్య, నాగార్జునరెడ్డి, సునిల్‌రెడ్డి, బాష, శ్రీనివాస్‌తోపాటు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.