ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం చేయాలి
♦ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్‌కు జగన్ సూచన
♦ ‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : విద్యా సంస్థల్లో ర్యాగింగ్ రక్కసి చెలరేగి రిషితేశ్వరి, మధువర్ధన్‌రెడ్డి లాంటి అమాయకులు బలవుతున్న తరుణం లో ర్యాగింగ్‌పై పోరాటానికి వైఎస్సార్ స్టూడెం ట్స్ యూనియన్ ఏపీ విభాగం నడుంకట్టింది. ‘స్టాప్ ర్యాగింగ్’ శీర్షికతో ఒక పోస్టర్‌ను రూపొందించింది. ‘ర్యాగింగ్ శిక్షార్హమైన నేరం’ అనే నినాదాన్ని ప్రధానంగా ముద్రించిన ఆ పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు.
కళాశాలల్లో ర్యాగింగ్ వల్ల అమాయకులు బలికాకుండా కృషి చేయాలని విద్యార్థి నేతలను జగన్ కోరారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చైతన్య పర్చాలని ఆయన సూచించారు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, ఇతర విద్యార్థి నేతలు ఆర్.రాకేష్‌రెడ్డి, బి.కాంతారావు, పి.చైతన్య, టి.అనిల్‌కుమార్, వై.నాగార్జున యాదవ్, సురేష్, వి.శ్రీకాంత్, డి.రవీంద్ర, డి.పూర్ణసాగర్, కె.నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.