టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హాస్టల్ విద్యార్థులకు సన్నిబియ్యంతో ఆహారాన్ని అందించాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బండి పరశురామ్ డిమాండ్ చేశారు.
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హాస్టల్ విద్యార్థులకు సన్నిబియ్యంతో ఆహారాన్ని అందించాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బండి పరశురామ్ డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి సంఘం నాయకులతో కలసి మంగళవారం రాత్రి ఆయన హిందూపురంలోని ముక్కడిపేట బీసీ, ఎస్సీ హాస్టల్‌లో నిద్రించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. వార్డెన్లు స్థానికంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని కోరారు.