హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటున్నారని కాంగ్రెస్ నేత శ్రవణ్ విమర్శించారు. చంద్రబాబుకు హైదరాబాద్లో ఏం పని అంటున్న కేసీఆర్.. సెటిలర్లను తరిమెయ్యడని గ్యారెంటీ ఎంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు అన్నాతమ్ముళ్ల మాదిరిగా వరసలు కలుపుతున్నారన్నారు. టీఆర్ఎస్, టీడీపీ రెండు పార్టీలు ఒకటేనని అనిపిస్తోందని శ్రవణ్ అన్నారు.
ఇంతకాలం సీఎం కేసీఆర్ పల్లకిని మోసింది బీజేపీ మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలే అని శ్రవణ్ విమర్శించారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రంటే రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటమే అని ఆయన విమర్శించారు.