
దురహంకారంతోనే కోదండరాంపై విమర్శలు
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) దురహంకారంతోనే కోదండరాంను విమర్శిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ అన్నారు. కోదండరాం కేవలం భూనిర్వాసితుల సమస్య గురించి మాట్లాడారే తప్ప ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న శ్రవణ్.. కోదండరాం వెనుక యావత్ తెలంగాణ ఉందన్నారు.