'తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోంది' | telangana congress leader sravan fires on kcr government | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోంది'

Published Mon, Jan 11 2016 3:01 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోంది' - Sakshi

'తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోంది'

హైదరాబాద్: తెలంగాణలో ఏడాదిన్నర కాలంగా  రాక్షసపాలన కొనసాగుతోందని టి.పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అభద్రతాభావంతోనే ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని..మిగతా ఎంపీలకు లేని అభద్రతాభావం కవితకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు.


హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలోనే విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ పాలన పూర్తిగా కామెడీ అయిందని.. జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ బూటకంగా మార్చేసిందని  శ్రవణ్ ఎద్దేవా చేశారు. గెలుపు కోసం అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించిందన్నారు. మంత్రి కేటీఆర్కు ఎన్నికల్లో సవాల్ విసిరే నైతికత లేదని ఆయన అన్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే... కేసీఆర్ రాజీనామా చేస్తారాన్న కోమటిరెడ్డి సవాల్ను ఎందుకు స్వీకరించలేదని శ్రవణ్ ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement