హైదరాబాద్ : ఛత్తీస్గఢ్తో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓపెన్ బిడ్ పిలవకుండా ఛత్తీస్గఢ్తో ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలపై బహిరంగ చర్చకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సిబ్బంది మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అధికారులను బదిలీ చేస్తున్నారని శ్రవణ్ విరుచుకుపడ్డారు.