
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో 52 శాతం జనాభా ఉన్న బీసీల నుంచి 9 మందికి రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించాలని.. అలా చేస్తే సీఎం కేసీఆర్‌కు బీసీలపై నిజంగా ప్రేమ ఉన్నట్లు విశ్వసిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆయన మాట్లాడారు.
దళిత సీఎం, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ల అమలుపై సీఎం మాట తప్పారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీసీలపై కపట ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. అందుకే కమిటీలు అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కేబినెట్‌లో 9 మందికి చోటు కల్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇక కేబినెట్‌లో ఒక్క మహిళకు చోటు కల్పించని చరిత్ర కేసీఆర్‌కే దక్కిందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లు రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment