కాఫీ విత్‌ ఫీలింగ్‌ | coffee with feeling | Sakshi
Sakshi News home page

కాఫీ విత్‌ ఫీలింగ్‌

Published Sat, Jul 30 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

కాఫీ విత్‌ ఫీలింగ్‌

కాఫీ విత్‌ ఫీలింగ్‌

పెదగంట్యాడ: ఒకప్పటి ప్రేమ వ్యక్తం చెయ్యడానికి పావురాలు, శునకాలు, ఇతరత్రా ప్రాణులు పనికొచ్చేవి( అవి రాజుల కాలం), 1980లో  లెటర్లు, తర్వాత గ్రీటింగ్‌ కార్డులు, తర్వాత  గిఫ్ట్‌లు పుట్టుకొచ్చాయి. ఎప్పుడైనా ఒక కొత్త పద్ధతి పుట్టిందంటే కొద్ది రోజులకే అది పాతబడుతుంది. ఇప్పుడున్న నెట్‌ లోకంలో ప్రేమ వ్యక్తీకరణ చాలా ఈజీ అయిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లో చెప్పేసుకుంటున్నారు. ట్రెండ్‌ ఎప్పుడూ కొత్తగానే ఉండాలి. అలా పుట్టుకొచ్చిన కొత్త వేదిక కాఫీ షాప్‌.... ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేయడానికి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి దేనికైనా ఒక్క కాఫీ సరిపోతుంది. ఎందుకంటే మన మనసులోని ఫీలింగ్స్‌ను కాఫీషాప్‌లో డిజైనర్‌కు చెబితే ఫోమ్‌తో అందంగా బొమ్మవేసి కాఫీ  పంపిస్తాడు.  ఈ ట్రెండ్‌ విదేశాల్లో ఉన్నా విశాఖలో కొత్తదే. ఎక్కువ మంది యూత్‌ ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. 
కాలేజ్‌ జంటలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్స్‌ అందరూ కాఫీ అంటే పడిపోతారు. అందుకే కుదిరితే కప్పు కాఫీ డైలాగ్‌ అంత పాపులర్‌ అయిపోయింది. ఇక కాఫీ ఫోమ్‌తో చేసే మ్యాజిక్‌ గురించి చెప్పాలంటే ముందుగా కాఫీపై తయారు చేసిన డిజైన్స్‌ గురించి తెలియాలి. అందులో అంత స్పెషల్‌ ఏమీ ఉండదు. చిక్కగా ఉన్న పాలను కాఫీలో సున్నితంగా వేసి కలపడం ద్వారా సష్టించే డిజైన్‌లే స్పెషాలిటీ
చిక్కగా ఉన్న బ్లాక్‌ కాఫీలో వైట్‌ మిల్క్‌ను మెల్లగా వేసి పైన కొంచెం మిల్క్‌ ఫోమ్‌తో డిజైన్‌ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఉండకపోయినా కాఫీ తయారు చేసే వ్యక్తి సజనాత్మకత ఆధారంగా కొత్త డిజైన్లు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మెనూ కార్డ్‌ సైతం మారిపోయింది. ఇంతకు ముందు క్యాపుచినో, ఎక్స్‌ప్రెస్సో, కోల్డ్‌ కాఫీ వంటివి ఉండేవి ప్రస్తుతం క్యాపిచినో ఆర్డర్‌ చెబితే మెనూ ఇచ్చి ఇందులో ఏ డిజైన్‌ కావాలో సెలక్ట్‌ చేసుకోమనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాఫీ ధర మినిమం 80 రూపాయల నుంచి 250 రూపాయల వరకూ ఉంది. డిజైన్‌ కోసం ఏమీ చార్జ్‌ చెయ్యరు కాని మన భావాలు అవతలి వ్యక్తులతో షేర్‌ చేయాలంటే ఇప్పుడు కాఫీ ద్వారా సందేశం ఇస్తున్నారు.
కాఫీషాప్‌లో కాఫీకి మన ఇంట్లో కాఫీకి తేడా ఎక్కడ వస్తుందంటే మనం పొడిని వాడతాం. వాళ్లు గింజల్ని బ్లెండ్‌ చేసి కాఫీలో కలుపుతారు. ఎక్కువగా బెంగళూరులో పండే అరబికా అనే గింజలే టేస్ట్‌కు ప్రత్యేక కారణం. ఏది ఏమైనా కాఫీలో వస్తున్న మార్పులు మరి కొన్ని రోజులు అయితే ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. అందుకే ముందుగా ఆలోచించడం మానేసి కాఫీ తాగండి డిజైన్‌ ప్రాక్టీస్‌ చెయ్యాలంటే ముందుగా మిల్క్‌ ఫోమ్‌ను సిద్ధం చేసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement