మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే? | Inspiring Story Of Postgraduate Tuktuki Das Who Opened Tea Shop | Sakshi
Sakshi News home page

MA English Chaiwali: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?

Published Sun, Nov 14 2021 5:55 PM | Last Updated on Mon, Nov 15 2021 11:06 AM

Inspiring Story Of Postgraduate Tuktuki Das Who Opened Tea Shop - Sakshi

మీరు జీవితంలో ఏదైనా విభిన్నమైన పనిని చేయాలని నిశ్చయించుకున్నట్లయితే, అప్పుడు సాధ్యం కానిది అంటూ ఏది లేదు. మీ కలను నిజం చేసుకోవాలంటే మీరు చేసే ప్రతి పనిని ఇష్టపడాలి అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. కోల్‌కతాకు చెందిన తుక్తుకి దాస్ దీనిని రుజువు చేశారు. తుక్తుకి దాస్ తన మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడానికి చాలా ప్రయత్నించింది, అయితే, ఆమె ఉద్యోగం సాధించలేకపోయింది. అయితే, అక్కడితో జీవిత ప్రయాణాన్ని ఆపకుండా.. ఏదైనా తనకు తెలిసిన పని చేయలని నిశ్చయించుకుంది. హబ్రా రైల్వే స్టేషన్లో టీ దుకాణాన్ని ప్రారంభించాలని అనుకుంది. కొద్ది రోజులకే తుక్తుకి దాస్ టీ దుకాణం 'ఎమ్ఏ ఇంగ్లీష్ చాయ్ వాలాయ్' పేరుతో ఆ నగరం అంతటా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.

ఉద్యోగ వేట
తుక్తుకి దాస్ ఒక పేద కుటుంబంలో జన్మించింది. తుక్తుకి తండ్రి వ్యాన్ డ్రైవర్, ఆమె తల్లికి ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది. తుక్తుకి తల్లిదండ్రులు ఆమె ఉపాధ్యాయురాలిగా మారాలని ఆశించారు. వాళ్ల తల్లి, తండ్రుల కోరిక మేరకు ఆమె కష్టపడి చదివి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అనుకుంది. తుక్తుకి దాస్ రవీంద్రభారతి ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఆ తర్వాత కోల్‌కతా నగరంలో హాస్టల్లో నివసిస్తూ ఉద్యోగ వేట ప్రారంభించింది. తుక్తుకి దాస్ ఎంఎ డిగ్రీ చేసినప్పటికీ ఉద్యోగం పొందలేకపోయింది. 

ఆమెకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ ఏ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె తన ప్రయాణాన్ని అక్కడితో అపలేదు. ఉద్యోగం పొందడంలో విఫలమైన తుక్తుకి దాస్ టీ స్టాల్ తెరవాలని నిశ్చయించుకుంది. యూట్యూబ్‌లో ప్రఫుల్ బిల్లోర్ అకా 'ఎంబిఎ చాయ్‌వాలా' వీడియో చూసి ప్రేరణ పొందింది. ఆ తర్వాత తుక్తుకి దాస్ హబ్రా స్టేషన్ సమీపంలో ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకొని నవంబర్ 1, 2021న 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి' బ్యానర్ కింద తన సొంత టీ స్టాల్ ప్రారంభించింది. ఆమె టీ దుకాణం ఓపెన్ చేసిన మొదటి రోజున సంతోషానికి చిహ్నంగా కస్టమర్లలో చాలా మందికి ఉచితంగా టీని పంపిణీ చేసింది.

తల్లిదండ్రులు ఒప్పుకోలేదు
ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలా టీ దుకాణాన్ని ప్రారంభించే ముందు అందరికీ ఎదురైనట్లే ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు టీ దుకాణాన్ని ప్రారంభించేందుకు ఒప్పుకోలేదు. మన బందువులు, స్నేహితులు నిన్ను చూసి ఏమి అనుకుంటారు. నువ్వు చదివిన చదువు ఏంటి, చేయబోయే పని ఏంటి అని ఆమెను అడిగారు. మిగతా వారి విషయం నాకు తెలీదు మీరు ఒప్పుకుంటే చాలు అని తన తల్లిదండ్రులతో అంది. ఒక మీడియాతో తుక్తుకి దాస్ తండ్రి మాట్లాడుతూ.. "మొదట్లో ఆమె నిర్ణయంతో నేను సంతోషంగా లేను, ఎందుకంటే ఆమె టీచర్ కావాలనే ఆశతో మేము ఆమెను చదివించాము. కానీ, ఆమె టీ అమ్మాలని కోరుకుంది. నేను పునరాలోచించి తర్వాత ఒకే చెప్పినట్లు" పేర్కొన్నాడు.

ఉన్నత విద్యావంతులు ఇలాంటి టీ అమ్మే వ్యాపారం చేయడం. ఇదే మొదటిసారి కాదు. మధ్యప్రదేశ్ రైతు ప్రఫుల్ బిల్లోర్ ఈ రోజు 'ఎంబిఎ చాయ్‌వాలా'గా ప్రసిద్ధి చెందారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతను సీఏటిలో మంచి స్కోరు చేయలేకపోయాడు. ఆ తర్వాత అతను టీ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు, అతనికి దేశవ్యాప్తంగా 22 అవుట్ లెట్లు ఉన్నాయి. త్వరలో అంతర్జాతీయ అవుట్ లెట్ కూడా ప్రారంభించనున్నాడు. ఇలా చాలా మంది కరోనా లాక్‌డౌన్ సమయంలో తమ ఉద్యోగాలు కోల్పోవడంతో వారు తమకు తెలిసిన, వచ్చిన పనిలో భాగ పేరు పొందారు. అందుకే, పెద్దలు చెబుతుంటారు ఒక చోట దారి మూసుకొని పోతే.. మన కోసం మరో చోట దారి తెరిచి ఉంటుంది అని. అంతేగానీ, ర్యాంక్ రాలేదని, ఉద్యోగం రాలేదని నిరాశ చెందుకుండా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement