ఉల్లంఘనలపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఔషధాల ధరలు ఎక్కువ చేసి విక్రయించడం, తప్పుడు లేబుళ్లుతో చేస్తున్న ఉల్లంఘనలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేన్ (డీసీఏ) కొరడా ఝుళిపించింది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో యాంటీ ఫంగల్ మెడిసిన్ ‘టెస్ట్రా–200 క్యాప్సూల్స్’ను ఓ మందులషాపులో కేంద్రం నిర్దేశించిన ఎమ్మార్పీపై చాలా అధిక ధరకు విక్రయిస్తుండడంతో మందులు స్వాదీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
ఈ మందు పది క్యాప్యూల్స్‌ను రూ.50.30 అధిక ధరకు విక్రయించినట్టు వివరించారు. అత్యవసర మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇలాంటి మందులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కళ్ల మందును జ్వరం మందు అంటూ...
కళ్ల వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందును.. జ్వరానికి మందు అంటూ తప్పుడు లేబుల్స్‌తో మార్కెట్‌లో ప్రచారం చేస్తున్న వారిని డీసీఏ గుర్తించిందని కమలాసన్‌రెడ్డి తెలిపారు. పీ–మైసిటిన్ అనే ఆయింట్‌మెంట్ అల్లోపతి మందును కళ్లవ్యాధి చికిత్సకు ఉపయోగించే మందుగా, మహసుదర్శన కఢ అనే ఆయుర్వేదిక్ మందును జ్వరాన్ని తగ్గించేదిగా తప్పుడు ప్రచారం చేయడంపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని ఓ మెడికల్ హాలుపై, ఖమ్మంలో మందుల దుకాణంపై దాడులు చేసి ఆయా మందులు స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలిలో నకిలీ క్లినిక్‌పై దాడి
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చి»ౌలిలో ఓ నకిలీవైద్యురాలు కె. స్వరూప తగిన అర్హతలు లేకుండా ‘స్వరూప ఫస్ట్ ఎయిడ్ సెంటర్’పేరిట నిర్వహిస్తున్న క్లినిక్‌పై డీసీఏ అధికారులు దాడిచేసి డ్రగ్ లైసెన్స్‌లు లేకుండా ఉన్న 17 రకాల మందులు (యాంటీ బయోటిక్స్‌తో సహా) స్వాదీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment