ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని సాంబయ్యగారి వీధిలో నివాసముంటున్న వస్త్రవ్యాపారి రూ.1.20 కోట్లకు ఐపీ పెట్టినట్లు తెలిసింది. ఈ మేరకు అతను రెండు రోజుల క్రితం ప్రముఖ న్యాయవాది ద్వారా కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 100 మందికి పైగా బాకీ ఉన్నట్లు అతను పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. వ్యాపారి గత కొన్నేళ్ల నుంచి శ్రీరాములపేటలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అతను దుకాణం తెరవకపోవడంతో రుణ దాతలు ఆందోళన చెందసాగారు. ఈ క్రమంలోనే కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు.