Published
Sun, Aug 14 2016 11:36 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాపు దగ్ధం
సూర్యాపేట మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్‌తో ఓ మోబైల్ షాపు దగ్ధమైన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పూలసెంటర్‌లో గల గౌస్ మోబైల్స్ దుకాణాన్ని శనివారం రాత్రి రోజుమాదిరిగానే బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూటై దుకాణం నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన చుట్టుపక్కల వారు దుకాణ యజమానికి సమాచారం అందించారు. యజమాని వెంటనే లబోదిబోమంటూ దుకాణం వద్దకు చేరుకునే సరికి రూ. 20 లక్షల ఆస్తి బుగ్గిపాలైపోయింది. దుకాణంలో ఉన్న విలువైన మోబైల్స్, ఇతర సామగ్రి పూర్తి కాలిబూడిదైపోయింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వై.మొగలయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు గౌస్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.