హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోన వ్యాప్తి, లాక్‌డౌన్ తదనంతరం కస్టమర్ల షాపింగ్ తీరు మారుతుందని ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని నివేదిక చెబుతోంది. ఆన్‌లైన్‌కే మొగ్గు చూపనున్నట్టు సర్వేలో వెల్లడైందని తెలిపింది. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో చేసిన ఈ సర్వే ప్రకారం.. రానున్న 9 నెలల్లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలన్న వారి సంఖ్య 46 నుంచి 64 శాతానికి చేరనుంది. కరోనాకు ముందు దుకాణాల్లో కొనుగోలు చేసిన వారి సంఖ్య 59 శాతం ఉంటే.. లాక్‌డౌన్ తర్వాత ఈ సంఖ్య 46 శాతం ఉండనుంది. డెలివరీ హామీ ఇచ్చే రిటైలర్ల వద్ద నుంచి కొనుగోళ్లకు 72% మంది మొగ్గు చూపారు. స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు 89 శాతం మంది తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌కు 78% మంది ఆసక్తి కనబరిచారు
Comments
Please login to add a commentAdd a comment