అలుపెరుగని ఉద్యోగి! | Cat runs store for 9 years without taking a day off | Sakshi
Sakshi News home page

అలుపెరుగని ఉద్యోగి!

Published Sat, Sep 24 2016 3:36 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

అలుపెరుగని ఉద్యోగి! - Sakshi

అలుపెరుగని ఉద్యోగి!

న్యూయార్క్: అమెరికాలోని ఓ కిరాణ కొట్టులో పిల్లి తొమ్మిదేళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తోంది. ఇది నిజం. న్యూయార్క్‌లో చైనాటౌన్‌లోని స్టోర్‌లో ఉద్యోగి ఒకరు తొమ్మిదేళ్ల క్రితం బోబో అనే పిల్లి కూనను తీసుకొచ్చారు. అప్పటినుంచి దాని యోగక్షేమాలను కస్టమర్ అయిన ఓ న్యాయవాది, ఉద్యోగి ఆనీసహా స్టోర్ సిబ్బంది చూస్తున్నారు. స్టోర్ ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని వచ్చిపోయే కస్టమర్లను పలకరిస్తుంది. ఎవరూ దొంగతనాలకు పాల్పడకుండా గస్తీ కాస్తుంది. సరుకు నిల్వలను పరిశీలిస్తుంది.  బోబో చేష్టలు, పనులతో కూడిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీని త్వరలో తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆనీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement