సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించిన జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం సోమవారం నుంచి బుధవారం వరకు 14 దుకాణాలు, సంస్థలకు సీల్ వేసిననట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించి తెరిచిన సంస్థలు, దుకాణాలకు సీల్ వేసినట్లు తెలిపారు. ఐకాన్ ఎయిర్‌కండిషన్ సర్వీసెస్(ఎస్‌పీ రోడ్), సిరి వాచ్ అండ్ మొబైల్ స్టోర్(అల్కాపురి), పద్మావతి బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్(అల్కాపురి), ది మార్బుల్ క్రాఫ్ట్(స్నేహపురి కాలనీ), న్యూ జయా స్టీల్‌ప్యాలెస్(అల్కాపురి), రవీందర్ స్టీల్‌ప్యాలెస్(దిల్‌సుఖ్‌నగర్), అలీ స్టడీ సెంటర్(సైదాబాద్), శ్రీయ ఫ్లెక్సీ ప్రింటర్(అమీర్‌పేట్), మొబైల్ ప్లానెట్(బంజారాహిల్స్), ఫ్యాషన్ ప్లానెట్(బంజారాహిల్స్), ప్రెస్టీజ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్(అల్కాపురి), పియోని కిడ్స్‌స్టోర్(బంజారాహిల్స్), జియో డిజిటల్స్(బంజారాహిల్స్), సువాస, రెడీమేడ్ వస్త్ర దుకాణం(బంజారాహిల్స్).
Comments
Please login to add a commentAdd a comment