పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలో గల జగదాంబ జువెల్లర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఎస్‌హెచ్‌వో లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి జువెల్లర్స్ షెటర్స్‌ని ఇనుప రాడ్లతో వంచి లోనికి ప్రవేశించారు. దుకాణంలోని సేఫ్టీ లాకర్‌ను తెరవడానికి విఫలయత్నం చేసి కుదరక పోవడంతో కౌంటర్ వద్ద నున్న రెండు కిలోల వెండి, రెండు తులాల బంగారు అభరణాలను అపహరించారు. దుండగుల ఆచూకీని కని పెట్టడానికి పోలీసులు జిల్లాకేంద్రం నుంచి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. దుకాణం షెట్టర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టం అమర్చక పోవడంతో దుండగులు సునాయసంగా చోరీకి పాల్పడ్డారు. దుకా ణం యజమానులు డీకొండ ప్రతాప్, డీకొండ మురళీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
సంఘటన స్థలాన్ని ఎస్సై శివరాజ్, ఐడీ కానిస్టేబుల్ గంగాప్రసాద్, కానిస్టేబుల్ బన్సీలాల్ సందర్శించారు. ఇదీలా ఉండగా అదే రోజు రాత్రి పట్టణంలోని ఆర్టీసీ డిపో వెనుక నివాసముండే మోతె భాస్కర్‌కు చెందిన మారుతీ జెన్ కారు చోరీకి గురైంది. భాస్కర్‌కు చెందిన చోరీకి గురైన కారు జువెల్లర్ దుకాణం వెనుక వీధి లో విద్యుత్ స్తంభానికి ఢీకొని ఉండడంపై పలు అనుమానాలకు తావి స్తోంది. చోరీకి గురైన జువెల్లర్స్ దుకా ణం పక్కన ఉదయం మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు భాస్కర్ చెందిన కారును నిలుపుకుని ఉన్నట్లు కనపడిందని ఓ పాల వ్యాపా రి తెలిపారు. కారు డ్రైవింగ్ సీటులో ఒకరుండగా, ఇద్దరు
బంగారం దుకాణంలో చోరీ
Published Thu, Sep 5 2013 4:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement