
బెడ్ వర్క్ప్ దుకాణంలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న గెలాక్సీ బెడ్ వర్స్క్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా దుకాణంలో అగ్రిప్రమాదం జరిగిందని షాప్ యజమాని తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంతో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.