టీడీపీ జెండా కట్టలేదని పాక తగలబెట్టారు | Old Woman regret on TDP leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా కట్టలేదని పాక తగలబెట్టారు

Published Mon, May 7 2018 7:03 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Old Woman regret on TDP leaders - Sakshi

‘అయ్యా... నేను రోడ్డు పక్కన చిరు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఆ దుకాణంపై టీడీపీ జెండా కట్టలేదనే కోపంతో అధికార పార్టీ నాయకులు నా పాకను ఆరు నెలల క్రితం తగులబెట్టారు’. అని  పెడనకు చెందిన అబ్దుల్‌ రజా బేగం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి వచ్చిన జననేత జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద వాపోయింది.  కొన్నేళ్లుగా రోడ్డు పక్కన తినుబండారం దుకాణం పెట్టుకొని జీవిస్తున్నానని, అధికార పార్టీ నాయకులు జెండా కట్టలేదని రాత్రి వేళలో తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో రోడ్డు మీదనే తినుబండారాలు అమ్ముకొంటున్నానని వాపోయారు. స్థలం కోసం దరఖాస్తు చేసుకొంటే ఇవ్వలేదని నా భర్త కూడా మృతి చెందాడని, స్థలం కావాలంటే పార్టీ జెండా కట్టమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement