Motorcycle Crashed Into Clothing Store In Vietnam, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన బైక్‌.. మొబైల్‌ చూస్తూ కూర్చున్న మహిళ, అక్కడే ఉన్న కుక్క ఒక్కసారిగా...

Published Mon, Feb 28 2022 2:40 PM | Last Updated on Mon, Feb 28 2022 4:17 PM

An Out Of Control Motorcycle Crashed Into A Shop In Vietnam - Sakshi

Motorcycle Crashed Into A Shop: ఇంతవరకు మనం చాలా రకాల ప్రమాదాలను చూసి ఉ‍న్నాం. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్‌లను కూడా చూశాం. అయితే కొద్దిమంది మాత్రమే ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అచ్చం అలాంటి ఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...వియాత్నంలోని హో చి మిన్‌లో ఒక వ్యక్తి నడుపుతున్న మోటారు బైక్‌ అదుపు తప్పి ఓ ఇంట్లోని లివింగ్‌ రూమ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో లివింగ్‌ రూమ్‌లో మొబైల్‌ చూస్తూ కూర్చున్న ఓ మహిళకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

లక్కీగా ఆమె వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున వెనక్కి జరగడంతో దూసుకొచ్చిన బైక్‌ ఆమెకు కొద్ది దూరంలో ఎగిరిపడింది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క సైతం ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! ఇక బైక్‌తోపాటు దాని రైడర్‌ కూడా వెళ్లకిలా పడి చచ్చాన్రా దేవుడో అని నడుము పట్టుకున్నాడు. స్వల్ప గాయాలతో అతను బయటపడటం, ఆ మహిళకు, కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ బైక్‌ ఎందువల్ల అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 



(చదవండి: యుద్ధ ట్యాంక్‌ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement