మంచు బిందువులు | funday childrens story | Sakshi
Sakshi News home page

మంచు బిందువులు

Published Sun, Feb 18 2018 1:40 AM | Last Updated on Sun, Feb 18 2018 1:40 AM

funday childrens story - Sakshi

అనగనగా ఒక ఊరిలో ‘గుగుడ్సె’ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని జేబులో ఏడు రూపాయి బిళ్లలున్నాయి. వాటిని లెక్కపెట్టాడు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఏడు రూపాయలే వస్తున్నాయి. మూడు రోజుల తరువాత లెక్కపెట్టాడు. కానీ జేబులో డబ్బులు ఏమాత్రం పెరగలేదు. వాళ్ల ఊరిలో ఓ రోజు ‘బహుమతుల పండుగ’ వచ్చింది. ఆ రోజు ఒకరికి మరొకరు ప్రేమతో బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.వాళ్ల అమ్మకి, గుగుడ్సె కారు బహుమతిగా ఇద్దామనుకున్నాడు.దుకాణంలోని కారు చాలా చిన్నగా ఉంది.దాంట్లో గుగుడ్సెనే సరిపోడు, ఇక వాళ్లమ్మ ఏం సరిపోతుంది?నాలుగు రూపాయలు ఇచ్చి ‘అందమైన గుండీ’ కొన్నాడు. ఆ గుండీ కోసం నీలం గౌను కొందామనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ దుకాణంలో నీలం గౌను లేదు.ఇంకో దుకాణంలో మంచి చెప్పులు చూశాడు.వాటి ధర ఎంతో అడుగుదామనుకున్నాడు.కానీ వాళ్ల అమ్మ పాదం కొలత గుగుడ్సెకు తెలియదు. ఇంటికి వెళ్లాడు. రాత్రి అయ్యేవరకు ఎదురుచూశాడు. వాళ్ల అమ్మకు అద్భుతమైన జానపద కథ చెప్పాడు. ఆమె నిద్రలోకి జారుకుంది. మెల్లగా ఓ దారంతో వాళ్ల అమ్మ పాదాన్ని కొలిచాడు. ఆ దారాన్ని దిండు కింద దాచిపెట్టి నిద్రపోయాడు. తర్వాతి రోజు దుకాణానికి వెళ్లేడు. అక్కడ ఉన్న చెప్పులన్నింటిని దారంతో కొలిచాడు. వాటిలో మంచి చెప్పుల జతను ఎంచుకున్నాడు. దానిపై ధర చూశాడు. చాలా ఎక్కువగా ఉంది. కానీ జేబులో మూడు రూపాయలే ఉన్నాయి. ఇంటిదారి పట్టాడు. వెళ్లేదారిలో ఉన్న కొండపైన కొన్ని మంచుబిందువులను ఏరుకున్నాడు.

ఆ మంచుబిందువులను తీసుకుని దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో మూడు రూపాయలు, మంచుబిందువులు ఇచ్చాడు. దుకాణంలో ఉన్న అమ్మాయి ఇది చూసి ఆశ్చర్యపోయింది.ఆ సంవత్సరంలో అవి తొలి మంచు బిందువులు. ప్రజలంతా గుగుడ్సెని పొగిడారు, కానీ గుగుడ్సె వాళ్ల అమ్మకు బహుమతి కొనలేకపోయాడు. ‘ఫర్లేదు. రేపు ఇంకొన్ని మంచు బిందువులను ఏరుకొస్తాను’ అనుకున్నాడు పిల్లవాడు.ఆ రోజు రాత్రి మంచువర్షం కురిసింది.ఆ ప్రాంతమంతా మంచుబిందువులతో నిండిపోయింది. కిటికీని ఆనుకుని గాఢనిద్రలో ఉన్న పిల్లవాడిని వాళ్ల అమ్మ నిద్రలేపింది. అతని చేతిలోని మూడు రూపాయల బిళ్లలు, అందమైన గుండీ జారి కిందపడ్డాయి.ఆ అందమైన గుండీ, వాళ్ల అమ్మకు ఇదివరకే ఉన్న పెళ్లిగౌనుకు చక్కగా సరిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement