Folk story
-
అరివీరమణివణ్ణన్
మగధీరులకు మాత్రమే పరిమితమైన సిలంబమ్ యుద్ధకళలో ఇప్పుడు నారీమణులూ తమ ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. ఐశ్వర్యా మణివణ్ణన్ అనే కేరళ యువతి ఆ ప్రావీణ్యానికి ఒక ప్రతీకాత్మకశక్తిలా నిలిచారు! గులాబీ బోర్డరున్న నెమలి కంఠం రంగు చేనేత చీర కట్టుకుందామె. సంప్రదాయబద్ధంగా పేరంటానికి వెళ్తుందేమో అనిపించేలా ఉంది ఆహార్యం. చూపరుల అంచనాను తలకిందులు చేస్తూ ఒకచేతిలో కర్ర, మరో చేతిలో బరువైన కత్తి పట్టుకుని బరిలో దిగింది. భరతమాత, తెలుగుతల్లిలాగానే యుద్ధమాత పాత్ర పోషిస్తోందేమో అనుకుంటే పొరపాటే. ఆమె ఆ పాత్రలో నటించడం లేదు, ఆ పాత్రలో జీవిస్తోంది. ఆమె కేరళకు చెందిన ముప్పై ఏళ్ల ఐశ్వర్యా మణివణ్ణన్. మీసాలను వంచింది! బరిలో మగవాళ్లతో పోటీపడి యుద్ధం చేస్తోంది ఐశ్వర్య. ఒక చేతిలో కంబు (కర్ర), మరో చేతిలో వాల్ (కత్తి) గాలిని చీలుస్తూ విన్యాసాలు చేస్తున్నాయి. వాటికి దీటుగా ఐశ్వర్య దేహం నేల మీద నుంచి రెండడుగుల పైకి లేచి ప్రత్యర్థి దాడిని తిప్పి కొడుతోంది. జానపద కథలో యువరాణిని తలపిస్తోందామె. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తోంది. ఆమె చేస్తున్న యుద్ధకళ పేరు సిలంబమ్. అది మూడు వేల ఏళ్ల నాటి కేరళ యుద్ధవిద్య. ‘ఇంతటి నైపుణ్యంతో యుద్ధం చేయడం మగవారికి మాత్రమే సాధ్యం’ అనుకుంటూ వచ్చిన సంప్రదాయపు భ్రాంతిని చీల్చి చెండాడుతోంది ఐశ్వర్య. ఆమెను చుట్టుముడుతూ మగ సిలంబమ్ వీరులు ఒక్కొక్కరుగా బరిలోకి వస్తున్నారు. వారందరినీ ఏకకాలంలో ఎదుర్కొంటోందామె. ఆమె ఛేదించింది మగవారికి పరిమితం అనుకున్న యుద్ధవిద్యా వలయాన్ని మాత్రమే కాదు, శౌర్యానికి, వీరత్వానికి ప్రతీకగా మగవాళ్లు మెలితిప్పుకున్న మీసాలను కూడా ఆమె తన కత్తి మొనతో కిందకు వంచింది. భరతనాట్యం నుంచి ఐశ్వర్య మొదట్లో భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆమె గురువు కవితా రాము సిలంబమ్ సాధన చేయమని సూచించడంతో ఐశ్వర్య ఇలాంటి మలుపు తీసుకుంది. నిజానికి కవితా రాము సిలంబమ్ సాధన చేయమని చెప్పిన ఉద్దేశం వేరు. సిలంబమ్ సాధన ద్వారా దేహదారుఢ్యం ఇనుమడించి, శరీరాకృతి చక్కగా తీరుతుంది, కాబట్టి భరతనాట్య సాధన సులువవుతుందనే ఉద్దేశంతో చెప్పారామె. గురువు చెప్పినట్లుగానే సిలంబమ్ సాధన మొదలు పెట్టిన తర్వాత భరతనాట్యం కంటే సిలంబమ్ సాధన చేయడాన్ని బాగా ఎంజాయ్ చేయసాగింది ఐశ్వర్య. అప్పటి నుంచి పూర్తి స్థాయి సిలంబమ్ యుద్ధకళకే అంకితమైంది. ‘ఇది ఓ సముద్రం, ఈదుతూ సముద్రం లోతుల్లోకి వెళ్లే కొద్దీ మరిన్ని మెళకువలు ఒంటపడతాయి. భరతనాట్యం ఎంతోమంది చేస్తారు. సిలంబమ్ సాధన అమ్మాయిలు చేయరు. అయితే ఇది ఆత్మరక్షణనిచ్చే కళ. అమ్మాయిలకు చాలా అవసరం కూడా. ఈ విషయాన్ని ప్రచారం లోకి తీసుకురావాలి. ఈ కళకు ప్రాచుర్యం కల్పించాలన్నదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం’ అన్నారు ఐశ్వర్య. – మంజీర పతకాల రాణి మలేషియాలో 2016లో జరిగిన ఏషియన్ సిలంబమ్ చాంపియన్ షిప్ పోటీల్లో వివిధ కేటగిరీలలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించింది ఐశ్వర్య. ‘‘సిలంబమ్ యుద్ధకళ దేహ దారుఢ్యాన్ని మాత్రమే కాదు మానసిక శక్తిని కూడా పెంచుతుంది. ఇది ధ్యానం వంటిది. దేహం, మెదడు ఏకకాలంలో దృష్టిని కేంద్రీకరిస్తూ సాధన చేయాలి. రెండింటి మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. సిలంబమ్ సాధనలో ఈ సమన్వయం మెరుగవుతుంది. సిలంబమ్ సాధనకు వయసు పరిమితులేవీ ఉండవు. ఈ కళకు విస్తృత ప్రచారం కల్పించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాను. చాలా స్కూళ్లు వాళ్ల కరికులమ్‌లో సిలంబమ్ మార్షల్ ఆర్ట్‌ను చేర్చడానికి సిద్ధమవుతున్నాయి’’ అన్నారు ఐశ్వర్య. -
మంచు బిందువులు
అనగనగా ఒక ఊరిలో ‘గుగుడ్సె’ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని జేబులో ఏడు రూపాయి బిళ్లలున్నాయి. వాటిని లెక్కపెట్టాడు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఏడు రూపాయలే వస్తున్నాయి. మూడు రోజుల తరువాత లెక్కపెట్టాడు. కానీ జేబులో డబ్బులు ఏమాత్రం పెరగలేదు. వాళ్ల ఊరిలో ఓ రోజు ‘బహుమతుల పండుగ’ వచ్చింది. ఆ రోజు ఒకరికి మరొకరు ప్రేమతో బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.వాళ్ల అమ్మకి, గుగుడ్సె కారు బహుమతిగా ఇద్దామనుకున్నాడు.దుకాణంలోని కారు చాలా చిన్నగా ఉంది.దాంట్లో గుగుడ్సెనే సరిపోడు, ఇక వాళ్లమ్మ ఏం సరిపోతుంది?నాలుగు రూపాయలు ఇచ్చి ‘అందమైన గుండీ’ కొన్నాడు. ఆ గుండీ కోసం నీలం గౌను కొందామనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ దుకాణంలో నీలం గౌను లేదు.ఇంకో దుకాణంలో మంచి చెప్పులు చూశాడు.వాటి ధర ఎంతో అడుగుదామనుకున్నాడు.కానీ వాళ్ల అమ్మ పాదం కొలత గుగుడ్సెకు తెలియదు. ఇంటికి వెళ్లాడు. రాత్రి అయ్యేవరకు ఎదురుచూశాడు. వాళ్ల అమ్మకు అద్భుతమైన జానపద కథ చెప్పాడు. ఆమె నిద్రలోకి జారుకుంది. మెల్లగా ఓ దారంతో వాళ్ల అమ్మ పాదాన్ని కొలిచాడు. ఆ దారాన్ని దిండు కింద దాచిపెట్టి నిద్రపోయాడు. తర్వాతి రోజు దుకాణానికి వెళ్లేడు. అక్కడ ఉన్న చెప్పులన్నింటిని దారంతో కొలిచాడు. వాటిలో మంచి చెప్పుల జతను ఎంచుకున్నాడు. దానిపై ధర చూశాడు. చాలా ఎక్కువగా ఉంది. కానీ జేబులో మూడు రూపాయలే ఉన్నాయి. ఇంటిదారి పట్టాడు. వెళ్లేదారిలో ఉన్న కొండపైన కొన్ని మంచుబిందువులను ఏరుకున్నాడు. ఆ మంచుబిందువులను తీసుకుని దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో మూడు రూపాయలు, మంచుబిందువులు ఇచ్చాడు. దుకాణంలో ఉన్న అమ్మాయి ఇది చూసి ఆశ్చర్యపోయింది.ఆ సంవత్సరంలో అవి తొలి మంచు బిందువులు. ప్రజలంతా గుగుడ్సెని పొగిడారు, కానీ గుగుడ్సె వాళ్ల అమ్మకు బహుమతి కొనలేకపోయాడు. ‘ఫర్లేదు. రేపు ఇంకొన్ని మంచు బిందువులను ఏరుకొస్తాను’ అనుకున్నాడు పిల్లవాడు.ఆ రోజు రాత్రి మంచువర్షం కురిసింది.ఆ ప్రాంతమంతా మంచుబిందువులతో నిండిపోయింది. కిటికీని ఆనుకుని గాఢనిద్రలో ఉన్న పిల్లవాడిని వాళ్ల అమ్మ నిద్రలేపింది. అతని చేతిలోని మూడు రూపాయల బిళ్లలు, అందమైన గుండీ జారి కిందపడ్డాయి.ఆ అందమైన గుండీ, వాళ్ల అమ్మకు ఇదివరకే ఉన్న పెళ్లిగౌనుకు చక్కగా సరిపోయింది. -
హంబర్ హాక్
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలపెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ దరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ డిన్నర్‌కు వెళ్లారు. జానపద కథలో రాకుమారిగా మారిన పేదరాలు‘సిండ్రెల్లా’ ఆనందాన్ని గుర్తుచేస్తూ : నబాబుగారు పార్టీనుంచి ఇంటిలోకి అడుగు పెట్టారు! స్వంత కారును ఎవరు కోరరు? అవసరం కూడా కదా! హైద్రాబాద్ వచ్చిన తొలి నాళ్లలోనే కారు గురించి ప్రయత్నాలు చేశాను. ఇంగ్లండ్‌కు చెందిన రూట్స్గ్రూప్ తయారీ అయిన హంబర్ కారు సెకండ్ హ్యాండ్లో అమ్మకానికి ఉంది అని తెలిసింది. రెండవ ప్రపంచయుద్ధం పూర్తయ్యాక కొద్ది మంది వీఐపీలకోసం ప్రత్యేకంగా తయారైన 1946 మోడల్ హంబర్ హాక్ కారు! ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు 7వ నిజాం సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన కారు! ఆయన రాజ్‌ప్రముఖ్ హోదాలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా జీవించే ఉన్నారు. అంతటి మహాశయుడు వినియోగించిన కారు! మరోమాట లేకుండా చెప్పిన ధరకు (రూ.3,200, అక్షరాలా మూడు వేలా రెండువందల రూపాయలు) వెంటనే కొన్నాను! నా కారును స్థానికులు మహా ఆరాధనాపూర్వకంగా చూసేవారు! చూడరా మరి! నిజాం కారు కదా! ఆ కారణం అర్థసత్యమేనని అంతకంటే మహత్తరకారణం ఉందని తర్వాత తెలిసింది! నిజాం-విప్లవం-ప్రజాస్వామ్యం హైద్రాబాద్ చరిత్రతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నా కారు గురించి అనేక విశేషాలు చెప్పేవారు! కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం! నిజాంను హతం చేయాలని ఒక విప్లవ సంస్థ తీర్మానించుకుందట! నారాయణరావ్ పవార్ అనే ఆర్యసమాజీకుడు ఇందులో సభ్యుడట. కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుడ ట! నిజాం దారుషిఫాలోని తన మాతృమూర్తి సమాధిని సందర్శించుకోవడానికి కింగ్‌కోఠీ నివాసం నుంచి రోజూ నిర్ణీత వేళకు కారులో బయలుదేరుతాడని పవార్ బృందం నిర్ధారించుకుందట! 1947, డిసెంబర్ 4వ తేదీన నిజాం బయలుదేరిన కారుపై నారాయణరావ్ పవార్ బాంబు వేశారట! కారును ఓ ఇంట్లోకి మళ్లించిన డ్రైవర్ చాకచక్యంతో నిజాం బతికి బట్టకట్టాడని కొందరు, కాదు, కారు గట్టిదనం వల్లేనని మరికొందరూ చెబుతుండేవారు! నారాయణరావ్ పవార్‌ను 1948, సెప్టెంబర్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఒక్కరోజు ముందు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడు. పవార్ దీర్ఘకాలం (2010) జీవించారు. ఒక శరణార్థ్ధి నిన్నటి పాలకుడి కారుకి యజమాని కావడం ‘మిరకిల్ ఆఫ్ డెమొక్రసీ’ కదా! అలా సాగనంపాను! నా కారుకు బ్రేకులు పడేవి కాదు. అయినా, ఒక్క చిన్ని ప్రమాదమూ జరగకుండా డ్రైవ్ చేశాను. స్పేర్ పార్టులు సరిగ్గా దొరికేవి కావు. హంబర్ హాక్ సిటీలోనే కాదు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయ్యింది! నా అవసరానికి ఉపయోగపడడం ముఖ్యం కదా! లాభం లేదని అమ్మకానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. నెల్లూరుకు చెందిన రామిరెడ్డి గారనే వ్యక్తికి కొన్నధరకి పైసా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా అమ్మేశాను! ప్రజెంటర్ : పున్నా కృష్ణమూర్తి